Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Australia becoming India’s favourite hotspot..

By   /  August 23, 2016  /  Comments Off on Australia becoming India’s favourite hotspot..

    Print       Email

chennai - australia largest market 2ఆస్ట్రేలియాకు చెన్నై నాలుగో అతిపెద్ద సోర్స్ మార్కెట్‌..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇండియన్స్ ఎక్కువగా ఆస్ట్రేలియా అంటే ఇష్టపడుతున్నారు. బిజినెస్ , ఎడ్యుకేషన్, టూరిజం.. ఇలా ఏది అయినా ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఎక్కువ ఆశక్తి చూపిస్తున్నారు. అలాగే.. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకు భారతీయులు అందిస్తున్న మద్దతు కూడా గణనీయంగానే ఉంది. ఈ విశేషాలు అన్ని తమిళనాడులో జరిగిన ఓ సర్వేలో వెల్లడయ్యాయి. ఆస్ట్రేలియాకు చెన్నై నాలుగో అతిపెద్ద సోర్స్ మార్కెట్‌గా ఆవిర్భవించిందని సర్వే ప్రకారం తెలిసింది. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు చెన్నై నుంచి టూరిజం ద్వారా రూ.500 కోట్ల మేర సమకూరిందని వెల్లడైంది.

టూరిజం ఆస్ట్రేలియా (ఇండియా, గల్ఫ్) దేశాల మేనేజర్ నిషాంత్ కషికర్ మాట్లాడారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారతీయులు 1.14 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు. చెన్నై నుంచి వెళ్ళినవారి ఖర్చులు అంతకుముందు కన్నా 21 శాతం మేర పెరిగాయన్నారు. ఆస్ట్రేలియాకు టాప్ టెన్ మార్కెట్లలో ఇండియా ఒకటి అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రేలియా మార్కెట్లలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు ఉన్నాయన్నారు.

టూరిజం ఆస్ట్రేలియా (ఆగ్నేయాసియా, గల్ఫ్) జనరల్ మేనేజర్ మైఖేల్ న్యూకోంబీ మాట్లాడుతూ.. యూరోప్ కన్నా ఆస్ట్రేలియా పర్యటన చౌక అని అభిప్రాయపడ్డారు. ఇండియా టాప్ 5 లో స్థానం దక్కించుకోవాలనేది తమ ఆకాంక్ష అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →