Loading...
You are here:  Home  >  World News  >  Australia News  >  Current Article

Australia police arrest Two teenagers over ‘terror plans’..

By   /  October 13, 2016  /  Comments Off on Australia police arrest Two teenagers over ‘terror plans’..

    Print       Email

australia-police1ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి కుర్రాళ్ల పథకం..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పథకం సిద్ధం చేశారా..? ఈ అనుమానంతోనే అక్కడి అధికారులు ఇద్దరు కుర్రాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వీరి పథక రచనకు ఐఎస్ఐఎస్ ప్రేరణే కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.ఈ యువకులను ఓ ముస్లీం ప్రార్ధనా మందిరానికి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

ఇద్దరిలో ఓ యువకుడు రెండు కత్తులను కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇద్దరిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇద్దరిలో ఒకరు ఓ ఉగ్రవాది కుమారుడు అని ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. అయితే దీనిపై మాట్లాడేందుకు పోలీసులు నిరాకరించారు. వీరిద్దరిని పర్రామట్టా చైల్డ్ కోర్ట్ లో ప్రవేశపెట్టారు.

ఈ అంశంపై న్యూసౌత్‌వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ కూడా స్పందించారు. ఈ కుర్రాళ్ళు ఎక్కడ దాడి చేయాలో ఖచ్చితంగా తెలియదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టామన్నారు. దీనికోసం కొన్ని రకాల పద్ధతులు ఫాలో అవుతున్నామన్నారు.వ్యతిరేక చర్యల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →