Loading...
You are here:  Home  >  World News  >  Australia News  >  Current Article

Australia shocks to Indians..

By   /  April 18, 2017  /  Comments Off on Australia shocks to Indians..

    Print       Email

australia-flagఇండియన్స్ కు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా బాటలో ఆస్ట్రేలియా కూడా పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ట్రంప్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే చేతల్లో కూడా ట్రంప్ ను అదే చేసి చూపిస్తున్నారు. ట్రంప్ ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గాని ఆస్ట్రేలియా కూడా భారతీయులకు షాక్ ఇచ్చింది. సాధారణంగా విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఆస్ట్రేలియాలో 457 వీసాను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వీసా ఉన్న వారినే కంపెనీలు కూడా ఉద్యోగంలో పెట్టుకుంటాయి.

 

కంపెనీలకు ఆస్ట్రేలియాలో నిపుణులు దొరకకపోతే విదేశాల నుంచి రప్పించుకుంటాయి. దీనికోసం 457 వీసాను ఉపయోగించుకుంటాయి. అయితే ఈ వీసా కాస్తా దుర్వినియోగం అవుతోందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది. 457 వీసాపై వచ్చిన వారు సుమారుగా నాలుగేళ్ళ పాటు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అయితే ఈ వీసా వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆ దేశ ప్రధాని టర్న్బుల్ అంటున్నారు. తమది వలసవాదుల దేశమే అయినప్పటికీ ఈ వీసాను రద్దు చేస్తామని అంటున్నారు. ఇలా చేయడం వలసలదారుల మీద కక్ష సాధింపు మాత్రం కాదని చెబుతున్నారు.

 

ఇప్పటికే దేశంలో నిరుద్యోగం 95 వేల మేరకు చేరిందని ఆస్ట్రేలియా ప్రధాని తేల్చి చెప్పారు.ఈ వీసాను రద్దు చేసి మరో కొత్త పద్ధతిని తీసుకువస్తామని తెలిపారు.ఆస్ట్రేలియాకు ఖచ్చితంగా విదేశీ నిపుణుల అవసరం ఉందని అన్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసే విదేశీయులలో ఇండియన్స్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో యూకే, చైనా ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →