Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Babu In A Hurry Lands In Trouble

By   /  November 1, 2016  /  Comments Off on Babu In A Hurry Lands In Trouble

    Print       Email

babuఅంత తొంద‌రెందుకు బాబూ?

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ ఎత్తుల‌కు పైఎత్తులు వేయ‌డంలో ఒక‌రిని మించిన‌వారు మ‌రొక‌రు. ఇద్ద‌రు ఒకే పార్టీలో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల‌న ఒక‌రి గురించి మ‌రొక‌రికి బాగా తెలుసు. అయితే ఎత్తులు వేయ‌డంలో బాబుతో పోల్చితే కేసీఆర్ ఒక అడుగు ముందుంటారు. అలాంటి ఎత్తుల్లో భాగమే ఏపీ స‌చివాల‌యం. కేసీఆర్ తన అవసరం కోసం ఏపీ సచివాలయాన్ని తన సొంతం చేసుకునేందుకు  రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ ను సీన్లోకి తీసుకొచ్చి.. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయాన్ని తమకు అప్పగించాలన్న విషయాన్నిఆయన చేత బాబును అడిగించిన తీరు చూస్తేనే కేసీఆర్ వ్యూహ చతురత ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. అయితే.. కేసీఆర్ వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకోలేని చంద్రబాబు.. గవర్నర్ అడిగిన వెంట‌నే తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న విషయాన్ని అదే రోజు ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరాకు పుట్టించే వ్యవహారంగా చెప్పొచ్చు.

InCorpTaxAct
Suvidha

అదే సమయంలో.. తాజా నిర్ణయంతో బాబు వేసే తప్పటడుగులు మరోసారి బయటపడినట్లే. ఏపీ సచివాలయం అంశాన్ని గవర్నర్ తనతో ప్రస్తావిస్తే.. ఆ విషయాన్ని క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదే రోజు చెప్పేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా మొదట సానుకూలంగా ఉన్నట్లు ప్రస్తావించి.. ఇప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడో కాలేలా చేస్తుందనటంలోసందేహం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే బాబుకు అంత తొంద‌రెందుకో అని కూడా ఆ పార్టీ నేత‌లే అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →