పవన్‌కు బాబు చెక్ పెడుతున్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాబు చెక్ పెట్టబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పవన్‌ను దూరం పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారా? పవన్‌కు దీటుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల్లోని కాపుల ఓట్లను టీడీపీకి మలుచుకుని అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష చేయగా భారీ మద్దతు లభించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించిన పవన్ కల్యాణ్ కాపు ఓట్లను చీల్చుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాపు ఓట్లను ఎలా టీడీపీ వైపు తిప్పుకోవాలనే కోణంలో బాబు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీకి కొంత దూరంగా ఉన్నకాపు నాయకులతో ఇప్పటి నుంచే బాబు మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో గంటా శ్రీనివాసరావు, చిన్నరాజప్ప, నారాయణ, త్రిమూర్తులుఉన్నా వీళ్లలో యాక్టివ్ ఉన్నవారు గంటా ఒక్కరే. అయితే గంటా శ్రీనివాసరావు ఎన్నికలప్పుడు ఎటు గాలి తోస్తే అటు వెళ్లే రకమని, అందుకే గంటాను చంద్రబాబు పక్కన పెట్టినట్లు సమాచారం. ఇకపోతే కాపు నాయకుల్లో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు ఉన్నారు. వీళ్లలో ఎవరినైనా రాష్ట్రనాయకుడిగా ప్రకటించి వాళ్లతో కాపు నాయకులను దగ్గర చేసుకోవాలని బాబు చూస్తున్నట్లుసమాచారం. అందులో భాగంగా బోండా ఉమాను ఇప్పటి నుంచే బాబు రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి బాబు పవన్‌ను దూరం పెట్టేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.