Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Babu is the culprit- Bhumana

By   /  September 8, 2016  /  Comments Off on Babu is the culprit- Bhumana

    Print       Email

Bhumanaబాబు చ‌రిత్ర అంతా కుట్ర‌లేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తుని రైలు దగ్దం కేసులో సీఐడీ పోలీసులు రెండు రోజుల పాటు గంటల తరబడి విచారణ చేసిన నేప‌థ్యంలో భూమ‌న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బుధవారం నాడు గుంటూరులో సీఐడీ అధికారుల ఏడు గంటల విచారణ తర్వాత భూమ‌న మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఏమ‌న్నారో ఆయ‌న మాట్ల‌ల్లోనే “ చంద్రబాబు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వంచన. వీటితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెరిగారు. అమాయకులను వేధించడంలో ఆయన దిట్ట. ఆయ‌న‌ను  వ్యతిరేకించేవాళ్లను, ఆయ‌న అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించే వాళ్లను ఆయన సహించలేరు. విరుద్ధ అభిప్రాయాలపై బాబుకు గౌరవం లేదు. బాబుకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారిని సహించలేక.. వాళ్లను అరాచకవాదులుగా చిత్రించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే నామీద కక్షతో నన్ను తుని కేసులో విచారణకు పిలిపించారు“ అని భూమ‌న విమ‌ర్శించారు.

బాబు కుట్ర‌లు చేసినా పోలీసులు తనతో చాలా మర్యాదగా వ్యవహరించారని చెప్పారు. అసలు తనపై కేసు కూడా నమోదు కాలేదని..కేవలం బెదిరింపులు..జగన్ ను బద్నాం చేసే పనిలోనే ఇదంతా సాగుతోందని ఆరోపించారు. తుని మంటలతో చలికాచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అమాయకులను శలభాలుగా మార్చాలని చూడటం అన్యాయం, ఆటవికం, అనాగరికమని.. ఈ ఆటవిక పద్ధతులను చంద్రబాబు మానుకోవాలని క‌రుణాక‌ర్ రెడ్డి సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →