Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Babu is worried about the MLAs that are coming from YSRCP

By   /  June 19, 2016  /  Comments Off on Babu is worried about the MLAs that are coming from YSRCP

    Print       Email

chandrababuఆ స్థానాలు గెల‌వ‌లేమా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు భ‌యం ప‌ట్టుకుంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకుంటున్నాము కానీ.. ఒక‌వేళ వాళ్లు రాజీనామా చేసి బై ఎలెక్ష‌న్స్ వ‌స్తే అక్క‌డ గెల‌వ‌గ‌ల‌మా? అనే అనుమానం మొద‌లైంది. దీనికి తోడు ఇటీవ‌ల వ‌చ్చిన ఓ స‌ర్వే రిపోర్టు చూసిన బాబు మ‌రింత భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట‌.  వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన 20 మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికిప్పుడు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్తే వారికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని తాజా స‌ర్వేలో వెల్ల‌డైంది. జ‌నం నాడీ ఎలా ఉంది? ఆ సీట్ల‌లో మ‌ళ్లీ వైసీపీ గెల‌వ‌గ‌ల‌దా? అధికార పార్టీ పాగా వేస్తుందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కనుక్కునేందుకు ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ ఇటీవ‌ల ప్రోఫెష‌న‌ల్ స‌ర్వే నిర్వ‌హించింది.

పార్టీ ఫిరాయించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌లుగురి చొప్పున స‌ర్వే నిర్వ‌హించారు. ఇందులో దాదాపు అన్నీ స్థానాలు వైసీపీ త‌ర‌ఫున నిల‌బ‌డిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ప‌నిలో ప‌నిగా ప్ర‌భుత్వ ప‌నితీరుపై కూడా ఈ స‌ర్వే బృందం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేసింది. ఇందులోనూ ప్ర‌భుత్వానికి సున్నామార్కులు ప‌డ్డాయి. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు త‌మ‌పై అన‌ర్హ‌త వేటు ప‌డినా..తొంద‌ర‌ప‌డి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కువెళ్లినా..భ‌విష్య‌త్తు ఏంట‌నే సందిగ్ధంలో ఉన్నారు. దీన్ని బ‌ట్టే చూస్తే వైసీపీ నుంచి నాయ‌కులు వెళ్లినా..ప్ర‌జ‌లు మాత్రం ఆ పార్టీని ఆద‌రిస్తునే ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →