Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Baghdad is under shock

By   /  July 4, 2016  /  Comments Off on Baghdad is under shock

    Print       Email

04baghdad-master768న‌ర‌మేధం

 

InCorpTaxAct
Suvidha

 

 

మ‌రో రెండు రోజుల్లో రంజాన్ పండుగ‌. కొత్త కొత్త వ‌స్తువుల‌తో  షాపుల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఏ వీధి చూసి వినియోగ‌దారుల‌తో నిండిపోయి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అనుకోని సంఘ‌ట‌న జ‌రిగిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌క్క‌నే ఉన్న వాళ్లంతా క‌ళ్లు తెరిచి చూసే స‌రికి ర‌క్తమోడీన దుస్తుల‌తో ప్రాణాలు కోల్పోయి క‌నిపించారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్ ఉలిక్కి ప‌డింది.  బాగ్దాద్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల బాంబుదాడులకు తెగబడింది ఐఎస్‌. ఈ పేలుళ్లలో 15 మంది చిన్నారులు సహా 172 మంది మృతి చెందారు. 350 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కర్రాదా వాణిజ్య ప్రాంతంలో  సూసైడ్‌ బాంబర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రిఫ్రిజరేటర్‌ ట్రక్కులో పెద్దఎత్తున పేలుడు పదార్థాలతో మార్కెట్‌లోని రద్దీగా ఉన్న ప్రాంతానికి వచ్చిన ఉగ్రవాది, తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దుర్ఘటనలో 172 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. మృతుల్లో 15 మంది చిన్నారులు, 10 మంది మహిళలు, ఆరుగురు పోలీసులు ఉన్నారు.

కాగా బాగ్దాద్‌లోని ఉత్తర షాబ్‌ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఇక్కడ ఉగ్రవాదులు శక్తివంతమైన ఐఈడీను పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. అమెరికా సంకీర్ణ సేనలు చేస్తున్న దాడులతో ఐఎస్‌ ఇరాక్‌పై క్రమేణా పట్టుకోల్పోతోంది. ఐఎస్‌ ఆధీనంలో ఉన్న ఫలూజా పట్టణాన్ని వారం రోజుల క్రితమే ఇరాక్‌ సైన్యం స్వాధీనం చేసుకొంది. ‘ఫలూజాకు పూర్తి స్వేచ్ఛ లభించింది’ అని ఇరాక్‌ ప్రభుత్వం ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఐఎస్‌ బాగ్దాద్‌పై విరుచుకుపడటం గమనార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →