బాలకృష్ణకు బాబు చెక్ పెడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు బాలకృష్ణకు చెక్ పెడుతున్నారా? అంటే కొంతమంది అవుననే అంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలకృష్ణను ఒకవైపు పొగుడుతూనే మరోవైపు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుపడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం నిర్వహించే ఏ కీలక కార్యక్రమాల్లో కూడా బాలకృష్ణను ఇన్వాల్వ్ చేయడం లేదు. తాజాగా బాలకృష్ణ 100వ సినిమా`శాతకర్ణి` సినిమా ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం పంపితే ఆ కార్యక్రమానికి కూడా రాలేదు. దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు మధ్య కొంత దూరం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
బాలకృష్ణకు నిధులు బాగా ఇచ్చి హిందూపురం నియోకవర్గంలో అభివృద్ధి బాగా జరిగితే బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడని, అతను గెలిస్తే తనకు ముప్పు అని చంద్రబాబు భావిస్తున్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బాలకృష్ణ గెలిస్తేమాత్రం లోకేష్ కు కాకుండా బాలకృష్ణకు పార్టీ పగ్గాలు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే బాలకృష్ణకు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నాట్లు సమాచారం. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బాబు కలలు కంటున్నాడని, అలాంటప్పుడు బాలకృష్ణ గెలిస్తే మాత్రం లోకేష్‌కు పార్టీ పగ్గాలు అందవనే ఉద్దేశంతోనే బాలకృష్ణ ఓడిపోవాలని బాబు కోరుకుంటున్నారని తెలుగుదేశంలోని కొంతమంది నాయకులే అంటుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.