Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Bala Krishna response on Nara Lokesh nomination..

By   /  March 6, 2017  /  Comments Off on Bala Krishna response on Nara Lokesh nomination..

    Print       Email

mla bala krishnaఎమ్మెల్సీ పదవికి లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయి: ఎమ్మెల్యే బాలకృష్ణ

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం లోకేష్ చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఇక ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ పదవి అన్నది లోకేష్ కు మంచి ఛాన్స్ అని చెప్పారు. అమరావతిలో రాజధాని పనులు వేగిరంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన నియోజక వర్గంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నారా లోకేష్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆయనతో పాటుగా కరణం బలరామ్, పోతుల సునీత, డొక్కా మాణిక్యవర ప్రసాద్, బచ్చుల అర్జునుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో అన్ని వర్గాలకి తగిన ప్రాధాన్యత ఇచ్చామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →