Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Bala Krishna watched ‘Krishnagadi Veera Premagadha’

By   /  February 17, 2016  /  Comments Off on Bala Krishna watched ‘Krishnagadi Veera Premagadha’

    Print       Email

krishna gadi veera prema gadha - 2

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు బాలయ్య ప్రశంసలు..
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు సూపర్ సక్సెస్ అయింది. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని హను రాఘపూడి డైరెక్ట్ చేశారు. ఈ మూవీని నందమూరి అందగాడు బాలయ్య ప్రసాద్ ల్యాబ్స్ లో తిలకించారు. నాని – మెహరీన్ జంటగా నటించిన సినిమా స్పెషల్ షో చూశారు.

InCorpTaxAct
Suvidha

సినిమా చూసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. నాని చాలా బాగా నటించాడని అన్నారు. సినిమాలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని లొకేషన్లను సినిమాటో గ్రాఫర్ యువరాజ్ అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసించారు. దర్శకుడు హను రాఘవపూడి సినిమాను చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారని అన్నారు. నిర్మాతలు సినిమా కోసం బాగా ఖర్చు చేసినట్లు తెలుస్తోందన్నారు. తాను నటించిన ‘లెజెండ్’ సినిమాను సందర్భానుసారంగా ఉపయోగించిన విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. తన ఫ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. పృథ్వీ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ చేసిన కామెడి మంచి ఎంజాయ్ మెంట్ అని ప్రశంసించారు. ఈ క్యారెక్టర్స్ సహా ప్రతి ఒకరూ చాలా బాగా నటించారని.. అన్నీ వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంజాయ్ చేసే చిత్రమని అన్నారు. బాలకృష్ణ లేపాక్షీ ఉత్సవాల్లో ఎంతో బిజీగా ఉన్నా.. టైమ్ కేటాయించి స్పెషల్ షో వీక్షించినందుకు.. చిత్ర నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →