ప్రధాని మోదీ ప్రకటనను స్వాగతించిన బలూచిస్థాన్ నేతలు..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ సందర్భంగా బలూచిస్థాన్ గురించి ప్రస్తావించారు. దీంతో బలూచిస్థాన్ నేతల్లో ఆత్మస్థయిర్యం బాగా పెరిగింది. ఒక్కో పార్టీకి చెందిన వారూ.. బహిరంగంగా బయటకు వచ్చి పాక్ కు వ్యతిరేకంగా గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై అక్కడి సంస్థ అయిన బీఎన్ఎం స్పందించింది. మోదీకి మద్దతుగా అమెరికా సహా పలు యూరప్ దేశాలు ముందుకు రావాలని కోరింది.
పాక్ మత ఉగ్రవాదాన్ని విధానంగా అమలు చేస్తోందని బీఎన్ఎం చైర్మన్ ఖలీల్ బలూచ్ అన్నారు. దీని వల్ల ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు అర్ధం చేసుకోవాలన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచలేమన్నారు. కాని వీలైనంతవరకు సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ 68 ఏళ్ళ క్రితం బలూచిస్థాన్‌ను ఆక్రమించుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ తో బలూచిస్థాన్ ఐదుసార్లు యుద్ధం చేసిందని గుర్తుచేశారు.
మానవత్వానికి వ్యతిరేకంగా తమ ప్రాంత ప్రజలపై పాక్ యుద్ధ నేరాలకు పాల్పడిందన్నారు. దీనిపై పాక్ ను జవాబుదారీ చేయడానికి భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా, యూరప్ దేశాలు ముందుకు రావాలన్నారు. బలూచిస్థాన్ విషయంలో భారత ప్రధాని మోదీ వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. బలూచిస్థాన్ లో పాక్ జాతీ విధ్వంసానికి, యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్నారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు నిర్లక్ష వైఖరిని ప్రదర్శించడం ఆందోళనకరమైన విషయమన్నారు.
బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రహుమ్డగ్ బుగ్టి ఓ వీడియో స్టేట్మెంట్ ద్వారా స్పందించారు. బలూచిస్థాన్‌పై ప్రకటన చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత సర్కారు, మీడియా, యావత్ భారత జాతి బలూచిస్థాన్ కోసం గళమెత్తాలని కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.