Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Bandaru Dattatreya, coordinating with 2 states chief ministers

By   /  April 19, 2016  /  Comments Off on Bandaru Dattatreya, coordinating with 2 states chief ministers

    Print       Email
Bandaruహైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం
రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత కోర్టు విభ‌జ‌న ఆల‌స్యమైంది. దీంతో లాయ‌ర్ల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. ఇరు రాష్ట్రాల మ‌ధ్య‌న కూడా ఇదో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీంతో కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ చొర‌వ తీసుకుని మంగళవారం కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడను దత్తాత్రేయ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభజనపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రితో మాట్లాడానని న్యాయశాఖ మంత్రి చెప్పారన్నారు. ఏపీకి హైదరాబాద్‌లో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. గతంలోనే సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తిని కలసి హైకోర్టు విభజనకు సహకరించాల్సిందిగా కోరినట్లు దత్తాత్రేయ చెప్పారు.
గతంలో జడ్జిల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కోర్టులకు కొత్త భవనాలు నిర్మించాలని న్యాయశాఖ మంత్రిని కోరానని చెప్పారు. బీడీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని దత్తాత్రేయ కోరారు. ఈనెల 21న బీడీ కార్మికుల సమస్యలపై కీలక సమావేశం ఏర్పాటు చేశామని, అత్యవసర సమయంలో పీఎఫ్‌ను వాడుకోవటానికి అవకాశం కల్పించామన్నారు. వృధాప్య పెన్షన్ పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా హైకోర్టు విభ‌జ‌న గొడ‌వ ముగిస్తే బాగుంటుంది. లేక‌పోతే మ‌ళ్లీ గొడ‌వ‌లు మొద‌ల‌వ‌డం ఖాయం.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →