Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Bandla Ganesh produce a film with Raghava Lawrence

By   /  February 27, 2016  /  Comments Off on Bandla Ganesh produce a film with Raghava Lawrence

    Print       Email

bandla ganesh with lawrence

లారెన్స్-బండ్ల గణేష్ కాంబినేషన్ లో హరర్ థ్రిల్లర్ మూవీ ‘నాగభైరవా’ ..?
భారీ చిత్రాలు అంటే బండ్ల గణేష్ పేరు ఠక్కున గుర్తొస్తుంది. ఈ ప్రొడ్యూసర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. అదీ రాఘవ లారెన్స్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లారెన్స్ హరర్ థ్రిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్ లా మారిపోయారు. ‘గంగ’ చిత్రంతో ఏకంగా వందకోట్ల మార్క్ ను కూడా దాటేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కనక వర్షంతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కాయి ఈ కొరియో గ్రాఫర్ కమ్ యాక్టర్ కి. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ బాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో నిర్మించనున్నారు. ముఖ్యంగా మూవీలో భారీ గ్రాఫిక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే సినిమాను ఓ విజువల్ వండర్ లా తెరకెక్కించాలని బండ్ల గణేష్ ప్లాన్ అని తెలుస్తోంది.

InCorpTaxAct
Suvidha

 

తమ బ్యానర్ లో ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించామని బండ్ల గణేష్ అన్నారు. ఇప్పుడు లారెన్స్ లాంటి మంచి దర్శకుడు, నటుడితో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అందులోనూ భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో హరర్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నామన్నారు. సినిమాలో నటించే వారిని ఇంకా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సినిమాకి ‘నాగభైరవ’ టైటిల్ ను పరిశీలిస్తున్నామన్నారు. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో నిర్మించిన చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో ఉంటుందని బండ్ల గణేష్ వెల్లడించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →