పీక్ స్టేజ్ లో బంగ్లా ఫ్యాన్స్ పిచ్చి..!
బంగ్లాదేశ్ అభిమానుల పిచ్చి పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఆసియా కప్ లో ఫైనల్‌కు ముందు ఓ బంగ్లాదేశ్ ఫ్యాన్ సామాజిక మాధ్యమంలో శనివారం పోస్ట్ చేసిన ఓ ఫొటోను చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. బంగ్లా ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్.. టీమిండియా కెప్టెన్ కెప్టెన్ ధోనీ తలను చేతితో పట్టుకెళ్తున్నట్టు గ్రాఫిక్ చేయబడిన ఓ ఫొటో ప్రతి టీమిండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేలా ఉంది. బంగ్లాదేశ్ అభిమానులు ఇలాంటి పనులు చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. 2015లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లినప్పుడు వన్డే సీరిస్ లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఆ దేశ యువ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ధాటికి టీమిండియా కుదేలైంది. దీంతో ఆ సిరీస్ ముగిసిన వెంటనే.. టీమిండియా క్రికెటర్లు అరగుండుతో ఉన్న ఫొటోనూ ప్రచురించారు. ముస్తాఫిజుర్ కట్టర్లకు భారత ఆటగాళ్లు బెదిరిపోయారంటూ.. ఎగతాళి చేస్తూ ఉన్న ఓ ఫొటో అప్పట్లో చాలా వివాదాస్పదమైంది.
ఈసారి ఏకంగా ధోనీ తలను పట్టుకెళ్తున్నట్లు పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ధోనీ అభిమానులు మండిపడుతున్నారు.అసలు భారత్ పై బంగ్లా ఫ్యాన్స్ ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి గతేడాది వన్డే వరల్డ్‌కప్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఓ ఘటన ఆజ్యం పోసింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ అవుటైన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చినందును అంపైర్లు దాన్ని నోబాల్‌గా నిర్ణయించారు. అయితే.. ఆ బంతి సరైనదేనని బంగ్లా అభిమానులు భావించారు. అంపైర్ అవుట్ గా ప్రకటించి ఉంటే తమ జట్టు గెలిచేదని వారు వాదించారు. అంతే అప్పటి నుంచి వారు టీమిండియాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు గతేడాది సొంతగడ్డపై బంగ్లా.. ధోనీసేనను ఓడించడంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు లంక, పాక్‌ను ఓడించి బంగ్లా ఆసియాకప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఫైనల్లో మోర్తజాసేన టీమిండియాను చిత్తు చేయాలనే ఆకాంక్షతో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఇలాంటి ఫొటోలు పెడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.