Loading...
You are here:  Home  >  Cartoons  >  Current Article

అచ్చ తెలుగు అందమునకు చందమైన తలపు – బాపు రమణీయపు అచ్చ తెలుగు బొమ్మ రూపు

By   /  December 14, 2015  /  No Comments

    Print       Email

Bapu ramayanaఅచ్చ తెలుగు అందమునకు చందమైన తలపు
బాపు రమణీయపు అచ్చ తెలుగు బొమ్మ రూపు
ఆత్మ, పరమాత్మల కమనీయ కలగలపు
నిత్యమై మనసున కొలువుండు ముచ్చటైన మైమరపు
స్వచమైన స్వాభిమాన సొగసుల ముచ్చట కొలుపు

బాపు బొమ్మ అంతలేసి కళ్ళతో ఇంత చక్కటి బొట్టు తో  అంతు లేని ఆత్మ విశ్వాశముతో   ఎంతో  ఒద్దిక తో ఉండే ఆమె  ఆత్మాభిమానం దెబ్బ తిన్నప్పుడు… మాత్రం అపర కాళి అవుతుంది..

InCorpTaxAct
Suvidha

రాధాకళ్యాణం లో రాధిక పాత్ర లోని చిలిపితనం చూపించిన బాపు గారు చివరికి ఆమె సంప్రదాయమునకు కట్టుబడ్డ తీరును ముచ్చటగా తెరకెకించారు. చేతికి గాజుల్లా  పాట ఎంత చక్కటి చిత్రీకరణ..

bapu satyabhamaసీత గా చంద్రకళను ఎన్నుకుని…. సంపూర్ణ  రామయణం లో…ఆమె కమనీయ నటన తో మనలను మంత్ర ముగ్ధులను చేసిన వారు సీత గా నయనతారను ఎన్నుకోవడం పెద్ద సాహసం అనుకున్న వారికి ఆమె నటనాభిషేకం తో బదులు చెప్పారు.

శ్రీరామ రాజ్యం నందు సీత పాత్రలో ఆధునిక యువతి అత్మాభిమానమును ఎంతో హృద్యముగా చూపించి బాపు గారు భళా అనిపించారు..

వాణీశ్రీ గారిని  మేకప్ లేకుండ చూపించే సాహసం చేసి.. అద్బుత నటనకు మేకప్ తొడుగులు వేరే అవసరం లేదని నిరూపించారు..

రాయినైనా కాకపోతినీ పాట నందు ఆమె అభినయం అనన్యసామాన్యం..

రాధా గోపాళం లో ఆధునిక యువతి వృత్తి ధర్మమునకు, భర్త అసూయకు మధ్య నలిగిపోయె పాత్రను అద్భుతంగా చూపించారు.

మిస్టర్ పెళ్ళాం ఆమని సామన్య గృహిణి నుంచి ఒక కార్పొరోట్ ఉద్యోగినిగ ఎదిగిన వైనం..  భర్త అభిజాత్యమును అతి చాకచక్యం గా ఎదుర్కున్న తీరును చూపించిన విధానం..   ఎంతో మంది ఆధునిక గృహిణి లకు ధైర్యమును ఇస్తుంది..

కొంతమంది పురుషోత్తముల వరసల మారే వైనం వివరము గా చూపించిన ఈ పాట మీ కోసం..

పెళ్ళిపుస్తకం లో భార్యా భర్తల బంధములు, అనుబంధములు, చిలిపి తగాదాలను మనోహరముగా చిత్రీకరించిన వారు వివాహ బంధం పటిష్టతను వివరించిన తీరు ఈ ఒక్క పాటను చూస్తే చాలు కదా..

ఈ పాట వినిపించని పెళ్ళి లోగిలి లేదంటే అతిశయోక్తి కాదేమో..

బాపు గారికి పౌరాణికములంటే ఉన్న మక్కువ వారి చిత్రములను చూస్తే అర్ధమైపొతుంది..

సంపూర్ణ రామాయణము ను తెరకెక్కించినచిన వీరు, లవకుశ కు  ఆధునికతను జోడించి శ్రీ  రామరాజ్యమును మనకందించారు..

మన వూరి పాండవులలో భారతమును స్పృసించారు.

రావణసురుడిగా రావు గోపాల రావు గారి నటనావిష్కరణను కలియుగ రావణసురుడులో అందించారు.

ముత్యాల ముగ్గులో రామాయణమునకు దర్పం పడుతూ.. రమణీయ సృష్టిని మనకందించారు..

అందులోని ప్రతీ పాట కూడ ఒక కావ్యం లానే అనిపిస్తుంది

సంపూర్ణ రామాయణం లోని హృద్యమైన శబరి పాటను అందించిన వారికి.. వాన జల్లు కురిసింది అన్న తమాషా పాట కు ఆలోచన ఎలా వచ్చిందో..

సుందరాకాండ లో తల్లి తంద్రులను కుమార్తె కలిపిన తీరు కూడ రామయణము ను గుర్తుకు తెస్తుంది..

ఇంక భక్త కన్నప్ప ఒక అద్బుత కావ్యం..

ఒక నాస్తికుడు.. అపర భక్తాగ్రేసుడి గా మారిన వైనం చూపించిన  తీరు అమోఘం..

ఆ చిత్రములో అన్ని పాటలు కూడ అజారామరము..

నాగేశ్వర రావు గారితో బుద్దిమంతుడు, అందాల రాముడు వంటి అద్బుత చిత్రములు,

శోభన్ బాబు గారి తో..సంపూర్ణ రామాయణం, జాకీ, కల్యాణ తాంబూలం  చిత్రములు అందించిన వారు

కృష్ణ గారితో మాత్రం 3 చిత్రములు సాక్షి, శ్రీ రాజెస్వరి విలాస్ కాఫీ క్లబ్, కృష్ణావతారం చిత్రములును అందించారు

అన్న గారు  రామా రావు గారి తో చిత్రములు ఎక్కువ తీయని వారు శ్రీరామాంజనేయ యుధ్ధం తో ఆ లోటు కూడ తీర్చెసారు..

చంద్ర మోహన్ గారు, శ్రీధర్ గారితో 2 చిత్రములు అందించిన వారు రాజెంద్ర ప్రసాద్ గారి తో 3 చిత్రములు అందించారు..

చిరంజీవి గారి తో తీసిన మంత్రి గారి వియ్యంకుడు లో మావ గారైన అల్లు గారిని అల్లుడు చిరంజీవి గారు ఏడిపించడం భలే పసందుగా చూపించారు..
మంత్రి గారి వియ్యంకుడు అంటే ఎవరో అనుకున్న మనకు నిర్మలమ్మ కు పెద్ద పీట వేయడం..ఆయనకు ఆడవారి మీద ఉన్న సహృదయతను తెలయచేస్తుంది..
ఏమని నే మరి పాడెదనూ..   ఎంథ హృద్యమైన చిత్రీకరణ..
కొలువైనాడే, చీ చీ పో, అమ్మ గదే అన్నీ ఇలా ఎంతో వైవిధ్యం గా  ఉంటాయి..

రాంబంటు, సీతమ్మ పెళ్ళి, గోరంత దీపం ఇవన్నీ  కూడ ఆయనకు రామాయణము పై ఉన్న మక్కువ ను బైటపెడతాయి..

ఇంక స్నేహం లో స్వచ్చమైన స్నేహమును చవి చూపించారు..

ఇన్ని అద్బుత రమణీయ కావ్యములు బాపు గారు మనకందించడము లో రమణ గారి పాత్ర సంపూర్ణముగా ఉంది

భగవద్గీతలో చెప్పినట్లు..ఆత్మ ను, పరమాత్మను ఎలా విడదీసి చూడలేమో.. అలానే బాపు, రమణ గారిని విడిగా ఊహించడం అసాధ్యం..

అందుకేనేమో.. రమణ గారు అమర లోకములకు ఏగిన.. కొద్దినాళ్లకే తాను కూడ వారి వెంటే పయనించారు బాపు గారు.. మనలను విషాదగ్రస్తులను చేసారు.

అమర లొకములకు ఏగిన ఓ మా బాపు

మరవలేని చిత్రముల ముచ్చటైన మైమరపు

మరువ గలమా మీ దృశ్య కావ్యముల తలంపు

ఎవరి చిత్రముల కొరకు ఎదురు చూడాలి రేపు

బాపు గారి జయంతి డిసంబర్  15 న వారి కి నివాళి గా..వారి అద్బుత చిత్రముల స్మృత్యాంజలి…

 

Courtesy: Usha Darisipudi

Usha Profile Photo

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →