Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Barack Obama in Cuba at start of historic visit

By   /  March 21, 2016  /  Comments Off on Barack Obama in Cuba at start of historic visit

    Print       Email

obamaa in kubha tour new 1

క్యూబాలో ఒబామా పర్యటన.. చారిత్రక పర్యటనగా అభివర్ణణ..

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా ప్రెసిడెంట్ బరాక్‌ ఒబామా క్యూబాలో ల్యాండ్ అయ్యారు. ఆయన వెంట భార్య మిషెల్‌, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.కుటుంబసమేతంగా ఒబామా మూడు రోజుల పర్యటన నిమిత్తం క్యూబా వెళ్లారు. ఒబామా క్యూబాలో దిగిన సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఫ్లైట్ దిగిన అందరూ గొడుగులు పట్టుకుని వెళ్లారు. ఇక క్యూబా విదేశాంగ మంత్రి ఒబామాకు ఘన స్వాగతం పలికారు.
1959 తర్వాత అమెరికా అధ్యక్షుని హోదాలో క్యూబా పర్యటనకు వెళ్లిన తొలి అధ్యక్షుడిగా ఒబామాగా చరిత్ర సృష్టించారు. హవానాలోని అమెరికా ఎంబసీలో ఒబామా మాట్లాడారు. తన పర్యటన చరిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. క్యూబాకు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

కమ్యూనిస్టు దేశమైన క్యూబాతో చాల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగానే బారక్ ఒబామా క్యూబాలో పర్యటనకు వెళ్ళారు. క్యూబా అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రోతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్య, రాజకీయ సంస్కరణలకు సంబంధించి వారు చర్చిస్తారని తెలుస్తోంది. ఒబామా మంగళవారం తిరిగి అమెరికా చేరుకుంటారు. క్యూబాలో అమెరికా మద్దతుతో కూడిన ఫుల్జెన్సియో బటిస్టా సర్కారుని 1959లో ఫిడెల్‌ క్యాస్ట్రోకు చెందిన గెరిల్లాలు కూలదోశారు. ఆ తర్వాత.. అధికారంలో ఉండగా ఆ దేశంలో అమెరికా అధ్యక్షులు ఎవ్వరూ పర్యటించలేదు. అయితే తన పర్యటనలో భాగంగా ‘ప్రజాస్వామ్యం’పై ఒబామా ఎలాంటి ప్రసంగాలు చేయకూడదంటూ క్యాస్ట్రో సర్కారు ముందుగానే సూచించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →