ప్రజల కోసం పోరాడితే ఉన్మాది అంటారా?
ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సీనియర్ పాత్రికేయుడు ఏబీకేప్రసాద్ వాజ్యంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొట్టేయటం.. అనంతరం ఏబీకేపై ఏపీముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శించటం లాంటి పరిణామాలపై జగన్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏబీకే లాంటి సీనియర్ జర్నలిస్ట్ ను ఉన్మాదిగా పేర్కొంటారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్న జగన్ పార్టీ నేతలు.. చంద్రబాబు సర్కారుపై ఫైర్ అయ్యారు. పదేళ్లు ప్రధానప్రతిపక్ష నేతగా వ్యవహరించి కూడా తప్పులు చేస్తున్నట్లు చెప్పిన జగన్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి బాబు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై కోర్టుకు వెళ్లిన జర్నలిస్ట్ పై ఉన్మాది ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్నించిన ఆయన.. బాబు సర్కారు దుర్మార్గ పోకడల్ని నిలదీయకూడదా? అని నిలదీశారు.
ఏబీకే లాంటి గొప్ప జర్నలిస్ట్ ను ఉన్మాదిని చిత్రీకరించటం దారుణమన్న బ్రహ్మానందరెడ్డి.. ప్రతి విషయంలోనూ విపక్ష నేతపై అభాండాలు వేస్తున్నారన్నారు. అవినీతి కారణంగా పట్టిసీమకు గండిపడితే ప్రతిపక్ష నేతపై అకారణంగా అభాండాలు వేయటం సరైనదేనా? అని ప్రశ్నించారు. పుష్కరాల సందర్భంగా వందల కోట్లు ఖర్చు చేసిన తనకు అయిన వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తూ లబ్ధి చేకూరుస్తున్నారంటూ బాబుపై ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.