Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

BCCI to announce cash award for U-19 World Cup cricketers

By   /  January 31, 2018  /  Comments Off on BCCI to announce cash award for U-19 World Cup cricketers

    Print       Email

అండర్-19 టీం కు బిసిసిఐ నజరానా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ సమీ ఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ ను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు యువ భారత ఆటగాళ్లు. పృధ్వి షా సారధ్యంలో టీం ఇండియా అద్భుత విజయాన్ని అందుకుని ఫైనల్స్ కు చేరింది. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరుకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఫైనల్ కు చేరిన భారత జట్టుకి బిసీసీఐ నజరానా ప్రకటించింది.

ప్రతిష్టాత్మక ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత జట్టుకి శుభాకాంక్షలు అందిస్తూ.. ఫైనల్ కు చేరిన జట్టుకి నగదు బహుమతి అందచేస్తామని ప్రకటించారు. అంతేకాదు వారు భారత్ చేరుకున్న తర్వాత సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే నజరానా ఎంత అన్నది మాత్రం చెప్పలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →