Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

జీవము నీవేకదా

By   /  March 27, 2016  /  Comments Off on జీవము నీవేకదా

    Print       Email
జీవము నీవేకదా
51389635694_Unknown
ఈ పాట 1967 లో విడుదలైన భక్తప్రహ్లాద సినిమాలోనిది!రచన-సముద్రాల సీనియర్,సంగీతం–రాజేశ్వరరావు
పాడింది–సుశీల . ప్రహ్లాదుని వేషధారిణి అయిన రోజారమణి మీద ఈ పాటను చిత్రించారు!రోజారమణి అద్భుతంగా  నటించింది.  ఈ సినిమాకు మాటలు రాసింది నరసరాజు గారు. సాధారణంగా సాంఘీక చిత్రాలకు మాటలు రాసే ఈయన ఈ పౌరాణిక చిత్రానికి కూడా అద్భుతమైన మాటల్ని రాసారు.  
****
జీవము నీవేకదా దేవా
జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా
నా భారము నీదేకదా
 
జనకుడు నీపై కినుక వహించి నను వధియింపా మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ చంపేదెవరూ సమసేదెవరూ
సర్వము నీవేకదా స్వామీ
 
నిన్నేగానీ పరులనెరుంగా
రావే వరదా బ్రోవగ రావే వరదా వరదా
అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా
 
హే ప్రభో హే ప్రభో
లక్ష్మీవల్లభ దీనశరణ్యా
కరుణా భరణా కమలలోచన
కన్నులవిందువు చేయగరావే
ఆశ్రిత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీవల్లభ లక్ష్మీవల్లభ
 
నిన్నే నమ్మీ నీపద యుగళీ
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా
పన్నగశయనా నారాయణా
 
మదిలో వెలిలో చీకటి మాపీ
పథము జూపే పతితపావనా
 
భవజలధినిబడి తేలగలేని
జీవులబ్రోచే పరమపురుషా
నను కాపాడీ నీ బిరుదమునూ
నిలుపుకొంటివా శ్రితమందారా
 
విశ్వమునిండీ వెలిగే నీవే
నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగనేలా
విషధర శయనా విశ్వపాలనా
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=J4PI3IjUPio&list=PLJhb42r4TlG86ar3yq3syFnCl8Lmc8yaM&index=3 వినండి!
******
డి.వి.నరసరాజు
Narasa-raju-d.v.-01
​డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 – ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.
1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరు లో జన్మించాడు. ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.
నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లో పాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం “నాటకం” చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు. గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత మరియు దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి ‘కారు దిద్దిన కాపురం’ డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత ‘అబ్బే’ అన్నారట. తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి వున్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. 2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు. ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి   
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →