కలిసిపోతారా?.. కలహాలు చేస్తారా?
కర్నులుజిల్లాలో ఎప్పుడూ ఉప్పు.. నిప్పులాగా ఉండే రెండు కుటుంబాలు ఇప్పుడు ఒక పార్టీలో చేరాయి. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగానే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అది ఏ స్థాయికి చేరాయంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారేటంత. వివరాల్లోకి వెళ్లితే.. 2004 సమయంలో భూమా టీడీపీలో ఉంటే.. శిల్పా బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉండేవారు. వైఎస్ కారణంగా శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా వ్యవహరించారు కూడా. ఇలా.. ఈ రెండు కుటుంబాలు తూర్పు.. పడమర అన్నట్లు ఉండేవి. వీరి మధ్య రాజకీయ విభేదాలు కూడా భారీగానే ఉండేవి. అప్పటి నుంచి అలా మొదలైన విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. అయితే వైయస్ మరణానంతరం టీడీపీలో చేరిన శిల్పా సోదరులు ఇప్పుడు కర్నూలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కూడా టీడీపీలో చేరాడు. భూమా చేరికను శిల్పా సోదరలు ముందు వ్యతిరేకించినా.. అధినేత సముదాయించడంతో సరే నన్నారు. అయినా కూడా ఇద్దరు కలిసి పనిచేయమంటే ససేమిరా అంటున్నారు. ఇది పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుండటంతో చంద్రబాబు కలుగజేసుకోక తప్పలేదు. ఈ మధ్యనే.. భూమా.. శిల్పా బద్రర్స్ ను ఒకచోటకు చేర్చి పంచాయితీ పెట్టిన బాబు.. వారిద్దరూ కలిసిపోవాలని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని తేల్చి చెప్పటంతో.. అధినేత మాటకు వెనక్కి తగ్గిన వారు తాము కలిసిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇంతకాలంగా సాగిన విభేదాలు.. బాబు అలా పంచాయితీ పెట్టగానే తేలిపోతుందా? అన్న సందేహాలు చాలామందికే ఉన్నాయి. చూడాలి మరి భూమా .. శిల్పా సోదరులు కలిసి పోతారో.. కలహాలు చేసుకుంటూ ఉంటారో.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.