ముగిసిన భూమా అంత్యక్రియలు..
భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆళ్లగడ్డ శివారులోని శోభా ఘాట్ లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో భూమా నాగిరెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు. భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు.ఇక భూమాకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హాజరయ్యారు. అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. భూమా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆళ్లగడ్డ జనసంద్రంగా మారింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.