విభజన హేతుబద్ధంగా జరగలేదు: గవర్నర్ నరసింహన్
శనివారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. విభజన చట్టంలో కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. అయితే విభజన మాత్రం హేతుబద్ధంగా జరగలేదన్నారు. తమ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ.13,716 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండంకెల వృద్ధి రేటు కోసం సర్కారు కృషి చేస్తోందన్నారు. కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని అన్నారు.
ఏడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గవర్నర్ నరసింహన్ వివరించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి అవుతుందని తెలిపారు. రూ.150 లతో టెలిఫోన్, నెట్ సేవలు అందిస్తామన్నారు. అలాగే హాస్టళ్ల ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని గరవ్నర్ అన్నారు. విద్యుత్ పొదుపులో సర్కారు 5 జాతీయ అవార్డులను గెలుచుకుందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందiకు కృషి చేస్తామని చెప్పారు.ఇందులో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏపీని ప్రత్యేకంగా నాలెడ్డ్ హబ్ లా తీర్చిదిద్దుతున్నామని నరసింహన్ చెప్పారు. ఇంటింటికీ ఎల్ ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.అలాగే ఐదు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలె విశాఖలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించామని చెప్పారు. మూడు వేల సోలార్ సెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమరావతి, బెంగళూరు మధ్య హైవే నిర్మాణం చేపట్టనున్నామని.. రూ 4.37 లక్షలతో ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.