Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bigg Boss Telugu Contestant Lucky Chance

By   /  October 12, 2017  /  Comments Off on Bigg Boss Telugu Contestant Lucky Chance

    Print       Email

బిగ్ బాస్ పాపకు భలే ఛాన్స్..!

 

EIS
EnGeniusInc

 

స్టార్ మాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో చేసిన హంగామా తెలిసిందే. 14 మంది కంటెస్టంట్స్ తో మొదలు పెట్టిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ బుల్లితెర ఆడియెన్స్ ను భలే ఎంటర్టైన్ చేసింది. ఇక ఫైనలిస్టులుగా మిగిలిన హరితేజ, శివ బాలాజి, అర్చన, నవదీప్, ఆదర్శ్ లకు ఇదవరకు ఉన్న ఇమేజ్ కన్నా ఇప్పుడు పర్వాలేదని చెప్పొచ్చు. ఇక సీజన్ వన్ విన్నర్ గా శివ బాలాజి గెలిచినా అందరి మనసుల్లో స్థానం సంపాదించింది హరితేజ.

లేడీ కంటెస్టంట్ గా తనలోని యాక్టివ్ నెస్ నే కాదు ప్రతిభను బయట పెట్టిన హరితేజ దాదాపు సీజన్ వన్ విన్నర్ అవుతుందనుకున్నా సరే ఎందుకో మిస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ టైటిల్ పోయినా క్రేజీ ఆఫర్లు ఆమె సొంతం కానున్నాయట. షో నుండి బయటకు రాగానే ఎందుకు ప్రోగ్రామ్స్ చేయట్లేదు అంటే వస్తున్న ఆఫర్లలో ఏది ఒప్పుకోవాలో తెలియడం లేదంట. ఈ క్రమంలోనే హరితేజకు జబర్దస్త్ యాంకరింగ్ ఛాన్స్ కూడా వచ్చిందని లేటెస్ట్ టాక్. వచ్చిరాని తెలుగులో ప్రోగ్రాం లాక్కొస్తున్న రష్మి కన్నా హరితేజ అయితే జబర్దస్త్ షోకి బాగా పాపులారిటీ వస్తుందని ప్రయత్నాలు చేస్తున్నారట. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన హరితేజ జబర్దస్త్ యాంకర్ గా అవకాశం కొట్టేసింది అంటే ఇక అంతకుమించిన లక్కీ ఛాన్స్ మరేముంటుంది చెప్పండి. మరి ఈ విషయంపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అప్పటిదాకా ఇది జస్ట్ రూమర్ అనే అనుకోవాల్సిందే.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Buddha Venkanna, MLC condemned the comments of Botsa Satyanarayana

Read More →