Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ!

By   /  November 14, 2016  /  No Comments

    Print       Email

12207966_10208069808082422_179444613_n(1)ఈ స్వంతత్ర భారత దేశానికి మొదటి ప్రధాని,దార్శనికుడు అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రాజనీతిజ్ఞుడే కాకుండా పండితుడు కూడా!

దేశానికి మరొక జాతిరత్నం అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అందించిన ఘనుడు!ఈ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళిగా ఈ చిన్ని వ్యాసాన్ని సమర్పిస్తున్నాను!శ్రీ జవహర్ లాల్ నెహ్రూ 14-11-1889 లో మోతీలాల్ నెహ్రూ,స్వరూపరాణి దంపతులకు అలహాబాద్ లో జన్మించారు!వీరిది కాశ్మీర్ పండిట్ల వంశం! తండ్రి మోతీలాల్ ప్రముఖ న్యాయవాది, ధనవంతుడు.ధనవంతుల కుటుంబం కావున నెహ్రూ గారి విద్యాభ్యాసం ఎక్కువగా విదేశాల్లోనే జరిగింది!ట్రినిటి కాలేజీనుండి ఆయన graduation పూర్తిచేసారు!

InCorpTaxAct
Suvidha

1432712383nehru1తర్వాత అక్కడే బారిష్టర్ గా కూడా శిక్షణను పొందారు! ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అలహాబాద్ హై కోర్ట్ లో న్యాయవాదిగా తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు!అప్పటికే మోతీలాల్ గారు గాంధీ గారి ప్రభావంలో ఉన్నారు! యవ్వనంలో ఉన్న నెహ్రూ కూడా గాంధీ గారి ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు.వెంటనే న్యాయవాది వృత్తికి స్వస్తి చెప్పి స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు!

గాంధీ గారికి కుడి భుజంలాగా పనిచేసారు! 1929 లోనే గాంధీ గారి ప్రోద్బలంతో జాతీయ కాంగ్రస్ కు అధ్యక్షుడయ్యాడు! 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఈయన పాత్ర మరువరానిది! ఆ సందర్భంలోనూ,రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలోనూ పలుసార్లు బ్రిటిష్ ప్రభుత్వం వారిచేత జైలు శిక్షను అనుభవించారు! 1947 లో భారత

slide_416808_5297934_compressedదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత,దేశానికి మొదటి ప్రధానిగా నియమితులయ్యారు!ఆయన చూపిన చొరవతో 1950 లో రాజ్యాంగాన్ని ఆమోదించారు!నెహ్రూ గారు చాలా విషయాల్లో మార్గదర్శిగా నిలిచారు!ఆయన చూపిన అలీన విధానాన్ని(non alignment policy) నేటికి కూడా ,ప్రభుత్వాలు మారినా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి! నెహ్రూ గారి పటిష్టమైన నాయకత్వంలో తర్వాత జరిగిన 1951,1957,1962 ఎన్నికలలో కాంగ్రెస్ కు అండగా ప్రజలు నిలిచారు! ఆ మూడు టర్మ్లకు ఆయనే ప్రధానిగా ఎన్నికయ్యారు!1916 లో ఈయన కమలాకౌల్ ని వివాహమాడారు!

వారికి ఏకైక కుమార్తె ఇందిరాప్రియదర్శిని(తర్వాత ఇందిరా గాంధి) 1917 లో జన్మించారు!  ఆమె1942 లో ఫిరోజ్ గాంధీని వివాహమాడింది!నవభారత నిర్మాత అయిన నెహ్రూ సుదీర్ఘ రాజకీయ యాత్రలో భాక్రానంగల్,నాగార్జున సాగర్ లాంటి బహుళ ప్రయోజక ప్రాజెక్ట్లు వచ్చాయి!చక్కని వ్యవసాయ విధానాలతో రైతులను ఆకట్టుకున్నాడు! భిలాయ్ లాంటి ఉక్కు కర్మాగారాలు ఈయన నేతృత్వంలోనే వచ్చాయి! ఇంతకు ముందుగా అనుకున్నట్లే అలీన విధానంతో చాలా దేశాలతో సత్సంబంధాలను కొనసాగించారు!

slide_416808_5297930_compressedగాంధీగారి హత్యానంతరం గుండెనిబ్బరంతో పెద్దరికాన్ని భుజాన వేసుకొని దేశాన్ని ఒంటిచేత్తో నడిపించాడు! 1962 లో చైనా యుద్ధం అప్పుడు ఈయన అనుసరించిన పంధా కొద్దిగా వివాదాస్పదమైంది!దలైలామాకు ఈ దేశంలో ఆశ్రయం ఇవ్వటానికి ఈయన తీసుకున్న నిర్ణయమే కారణం! దేశంలో ఒక పాపులర్ నాయకుడిగా ఎదిగిపోయాడు!ఈయన మీద కూడా నాలుగు సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి!అయితే,భగవంతుని దయవలన బయట పట్టాడు!mixed economic పాలసీ ని అనుసరించారు!

ఈయన జైలు శిక్ష అనుభవించే సమయంలో ,Discovery Of India ,Letters To Indira లాంటి చక్కని గ్రంధాలను రచించి పండితుడిగా ప్రసిద్ధి గాంచాడు!సోదరి విజయలక్ష్మి పండిట్ కూడా రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించింది!యవ్వనంలో ఈయన Theosophical వారి గ్రంధాలను ఎక్కువగా చదివి వాటి వల్ల ప్రభావితుడయ్యాడు!మతాన్ని ఎప్పుడూ రాజకీయాల్లోకి రానీయలేదు!ఈ దేశం యొక్క secular స్ఫూర్తికి ఎక్కడా మచ్చ తేలేదు!1951 లో ననుకుంటాను,అప్పటి ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని వేదపండితుల ఆశిస్సులతో జరగాలని నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారు నిర్ణయించి,నెహ్రూ గారికి ఆ విషయాన్ని చేరవేసారు! నెహ్రూ గారు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు!దానికి కారణం,అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని!

ఈయన మతాల్ని దూరంగా ఉంచేవారు!విద్యాభ్యాసమంతా విదేశాల్లో గడపటంవల్ల కొద్దిగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాడు!ఎక్కువగా సిగరెట్లు త్రాగేవాడు!లేడీ మౌంట్ బాటన్ కు ఈయన సిగరెట్ వెలిగిస్తున్న ఫోటోలను నెట్ లో పెట్టి ,అదేదో ఈయన భారతీయయతను మంటకలిపాడని సంఘ్ పరివార్ వాళ్ళు గగ్గోలు పెడుతుంటారు!ఒకమార్గదర్శిని,నవభారత నిర్మాతను అసభ్యంగా చిత్రించటం దారుణం!నెహ్రూ సంస్కృతిని పూర్తిగా నాశనం చెయ్యాలని కొన్ని శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయి!

slide_416808_5297928_compressedఈయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం!అందుకనే,ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఎప్పటినుంచో జరుపుతున్నారు!కోటుకు ఎర్ర గులాబీని ధరించి చక్కని దుస్తులతో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు!శాంతి కపోతాలను ఎప్పుడూ ఎగురవేసే శాంతికాముకుడు ఈయన!ఆయన సమకాలీకుడైన అమెరికా ప్రెసిడెంట్ కెనెడీతో,రష్యా ప్రధానులు కృశ్చేవ్ , స్టాలిన్ తో ఈయనకు సత్సంబందాలుండేవి! ఈయనకు 1955 లోనే ‘భారతరత్న’ను ఇచ్చారు!

ఈయన ప్రధానిగా,కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అఖిల భారతీయ కాంగ్రస్ సభలు గుంటూరులో జరిగాయి!అప్పుడు నాకు బాగా ఊహ వుంది!మా నాన్నగారు ఆ సభలకు నన్ను తీసుకొని వెళ్ళారు!నెహ్రూ గారితో పాటుగా,చాలామంది నాయకులను చూసాను! దేశాన్ని సుస్థిరంగా నడుపుతున్న ఈయన అకస్మాత్తుగా గుండెపోటుతో 27-5-1964 న మరణించారు!
నవభారతనిర్మాత దివికేగారు!నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలాలో ఆయన చిరునవ్వుల గలగలలు ఎప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి! ఆ మహనీయునికి నా స్మృత్యంజలి!

 

Courtesy: Sastry TVS

1499603_1381816042085892_1565440850_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

NATA Women’s Day @Charlotte – A Grand Success

Read More →