Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

మహా నటి అంటే ఏకగ్రీవం గా అందరు తల్చుకునేది అభినేత్రి సావిత్రి గారినే.

By   /  December 6, 2017  /  No Comments

    Print       Email
12053344_10207828666494033_320881891_nమహా కవి అని శ్రీ శ్రీ గారిని,దేవులపల్లి వారిని ఇలా చాలా మందిని అనడం విన్నాము కాని..
మహా నటి అంటే ఏకగ్రీవం గా అందరు తల్చుకునేది అభినేత్రి సావిత్రి గారినే.
నిండైన విగ్రహం, నటనలో విగ్రహం అని బాపు గారు ఉవాచించినా
నటన అంటే సావిత్రి గారే అని శోభన్ బాబు   గారు నిర్వచించినా..
ఇండియన్ ఇంగ్రిడ్ బెర్మన్ గా ఎంతోమంది ముద్దు గా పిలుచుకున్నా..
మనలో అధిక శాతం ఇష్టపడే నటి మాత్రం సావిత్రి గారే అని నిస్సందేహం గా ఒప్పుకుంటారు అందరూ.. ఆమె చనిపోయి 30 ఏళ్ళు గడచినా… ఆమె నటన ను స్మరించుకోని సినీ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదేమో..
ఎందుకంటే ఆమెలా భావములు పలికించడం అనితర సాధ్యం.
ఆమెకు జరిగిన అనుభవములు భరించడం కూడా అనితర సాధ్యం
29-1369804483-gundammakatha-ntr-savitri-telugu-moviesongs-lyricsడిసంబర్  6 న ఆమె జయంతి ని పురస్కరించుకుని.. ఆమె అద్బుత చిత్రములతో ఆమెకి నట నీరాజనం పలకడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం..
అహ నా పెళ్ళంటూ మాయాబజార్ లో ఆమె చేసిన అందమైన అల్లరిని…
మిస్సమ్మ గా ఆమె రమ్యమైన రుస రుసలను అనుభవించి…
కన్నులలొ ఆమె చూపించిన మిస మిస లను  ఆస్వాదించని   మనసు ఉండదు..
నీవు లేక వీణ నిలువలేననదీ అంటూ విరహమును విశిష్టముగా అభినయించిన తీరు,
 నిన్ను చూడనీ నన్ను పాడనీ అంటూ భర్త ప్రేమకై తపించిపొయే యువతిగ ఆమె వినిపించిన
విషాద హృదయపు హోరు మరిచిపోగలమా. ..
 నీ చెలిమే నేను కొరితినీ..ఈ క్షణమే ఆశ వీడితినీ అంటూ..  ప్రియునిపై ప్రేమను ఆమె ఆర్తిగా నినదించినా  ..
కన్నయ్యా నల్లని కన్నయ్యా..బంగారు మనసునే వొసగీనావు..మోము పై నలుపునే పూసినావూ అంటూ భగవంతునిని  భక్తి తో ఆమె నిలదీసినా..  చెమ్మగిల్లని నయనం  ఉండునా ..
ANR-Savitri-647x450ముద్దబంతి పూవులో మూగ కళ్ల ఊసులను.. ముగ్ధముగా అభినయించిన ఆమె
మంచి మనసుల లో అల్లరి పిల్లగా కధానాయకుని ఆట పట్టించినా..
అనుపమ త్యాగము తో అందరి మనసులను చూరగొ న్నారు..
ఆలయాన వెలిసిన ఆ దేవత అంటే ఇల్లాలే  అనిపించారు..మాతృ దేవతగా కరుణను కురిపించారు… సుమంగళిగా సున్నితమైన నటన తో సజల నేత్రములను  తెప్పించారు.
కన్యాసుల్కం లొ చింతామణిగా సోగసైన వగలు కురిపించినా..తోటి కోడలిగా గడుసైన నటన కనపరచినా….ఆమెకె ఆమెయే సాటి..
 పాండవ వనవాసం, నర్తనసాలలొ ద్రౌపదిగా ఆమె సఖియా అంటూ వివరించిన వివరమూ…
పెళ్ళి చూసి చూడులోకనపరచిన అభినయమూ ఎవరైనా మరచిపోగలమా.
.
రక్తసంబంధం తో అన్నయ్య మీద ప్రేమను చంపుకోలేక.. భర్తను దూరం చేసుకొలేక ..
ఆమె పడే వేదన…  దేవదాసు కు దూరమై పార్వతిగా ఆమే పడే ఆవేదన..
అర్ధాంగి గా ఆమె అపురూప నివేదన..
HYF20TODI_KODALLU__2315743gవేయి మాటలేల..  ఒక్క చూపు చాలునే.
కమనీయ కావ్యములు కనులతో కనపరచిన కమల నేత్రికు నీరజనాలు, నివాళులు అర్పించుటకు..
వెలుగు నీడలు ఆమె జీవితములో ఎప్పుడూ తారసలాడినా.. చివరి వరకూ మనకు ఆమె నటనా కాంతులను అందించారు..
చివరకు మిగిలెది ఏముంది అంటూ అమరలోకములకు ఏగారు..
ఆమె నటనను శ్వాసించి.. ఆమెను ప్రేమించిన అశేష జన ప్రేక్షకావళి హృదయపు కోవెలల లో
ఎప్పుడూ కొలువుంటారు..
అపురూప భావములు అలవోకగ పలికించిన అభినేత్రి
అభినయమునకు అసలు అర్ధము చూపిన అధినేత్రి
ఆర్ద్రమైన మనసుతో అందరినీ ఆదుకున్న జనయిత్రి
కమనీయ కావ్యములు కనులతో కనపరచిన కమల నేత్రి
సాటి లేరు తల్లీ నటనలో నీకు ఎవరూ నగుమోము సావిత్రి
Courtesy: Usha Darisipudi
Usha Profile Photo
Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →