Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP announced support to TDP in Nandyal by election..

By   /  August 12, 2017  /  Comments Off on BJP announced support to TDP in Nandyal by election..

    Print       Email

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు ప్రకటించిన బీజేపీ

 

EIS
EnGeniusInc

 

 

ఎన్నికలకు ఇంకా 20 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోపుగా నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అవసరమైన నేతలను ఇప్పటికే పార్టీలోకి చేర్చుకుంది. మరోవైపు వైసీపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్ అక్కడ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓ ఉపఎన్నిక కోసం ఓ పార్టీ అధినేత రంగంలోకి దిగి ప్రచారం చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కడా జరగలేదని చెప్పొచ్చు.దీన్ని బట్టి ఆ పార్టీ కూడా నంద్యాలను బై ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న బీజేపీ నోరు మెదిపింది. నంద్యాల ఉప ఎన్నికలో తమ మద్దతు టీడీపీకేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. భేటీ తర్వాత బీజేపీ నేతలు తమ మద్దతు టీడీపీకేని ప్రకటించారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →