Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP blames Babu Government for misusing one lakh crore funds on AP special status

By   /  May 16, 2016  /  Comments Off on BJP blames Babu Government for misusing one lakh crore funds on AP special status

    Print       Email

tdp-bjpతారా స్థాయికి చేరిన బీజేపీ..టీడీపీ విభేదాలు    

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదంటూ  కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పిన నేప‌థ్యంలో ఏపీలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ తెలుగుదేశంపై ఒత్తిడి తీసుకువ‌చ్చాయి. తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా చేశాయి. అయితే ఈ ప‌రిస్థితుల్లో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని టీడీపీ విమ‌ర్శించాలా? వ‌ద్దా? అని ఆలోచించుకుంటుండ‌గానే బీజేపీ టీడీపీపై ఫైర్ అవుతూ వ‌చ్చింది. రాష్ట్రానికి కేంద్రం ల‌క్ష‌ల కోట్లు నిధులు విడుద‌ల చేసింద‌ని, అవ‌న్నీ ఏమ‌య్యాయో లెక్క‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది.  కేంద్ర ప‌థ‌కాల‌న్నీ చంద్ర‌బాబు ఖాతాలో వేసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హెచ్చ‌రించింది. దీంతో టీడీపీకి దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాక్ అయింది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోగా మాపై ఆరోప‌ణ‌లా అంటూ టీడీపీ కూడా బీజేపీపై మాట‌ల దాడి చేస్తోంది. చంద్ర‌బాబు నాయుడు తొంద‌ర ప‌డ‌వ‌ద్ద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు చెబుతున్నా.. ప్ర‌జ‌ల నుంచి ఒత్తిడితో బాబు మాట‌ల‌ను కూడా లెక్క చేయ‌కుండా బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, బాబూ రాజేంద్రప్రసాద్, వంటి నేతలు బీజేపీ నేతల‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. ఎంపి రాయపాటి సాంబశివరావు అయితే ఒక మెట్టు పైకెళ్లి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ నాశనం అయిపోతుందని శపించారు.

దీనిపై బీజేపీ నేత‌లు కూడా స్పందించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపైనా కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ప్రముఖంగా స్పందించి ఎదురుదాడి చేశారు. పురంధేశ్వరి సైతం కేంద్రపథకాలను టీడీపీ  ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తగా, టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిందని, వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడిందని కావూరి సాంబశివరావు బహిరంగంగానే ధ్వజమెత్తారు.నిన్న‌టి వ‌ర‌కు త‌మ‌ది జ‌న్మ‌జ‌న్మ‌ల బంధ‌మ‌ని చెప్పుకు తిరిగిన టీడీపీ.. బీజేపీ నేత‌లు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →