Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP came to power in Uttar Pradesh, Lagadapati survey results..

By   /  March 10, 2017  /  Comments Off on BJP came to power in Uttar Pradesh, Lagadapati survey results..

    Print       Email

lagadapati rajagopalయూపీలో అధికారం బీజేపీదే.. లగడపాటి ఫ్లాష్ టీమ్ సర్వే రిజల్ట్స్..

 

InCorpTaxAct
Suvidha

 
లగడపాటి రాజగోపాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన మాజీ కాంగ్రెస్ ఎంపీగా అందరికి సుపరిచితులే. అయితే ఆయన ఎన్నికల్లో ఫ్లాష్ టీమ్ పేరుతో సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ఖచ్చితమైన రిజల్ట్స్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. గతంలో ఆయన చెప్పిన రిజల్ట్స్ నిజమైన సందర్భాలు ఉన్నాయి. ఇక యూపీ ఎన్నికల సందర్భంగా ఆయన ఫ్లాష్ టీమ్ సర్వే చేపట్టింది.

యూపీలో బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చి చెప్పారు. మేజిక్ ఫిగర్ కి కాస్త అటూ ఇటూగా సీట్లు వస్తాయని తెలిపారు. యూపీ మేజిక్ ఫిగర్ 202గా ఉంది. అలాగే యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ తో జతకట్టినా జనం మాత్రం బీజేపీ వైపు నిలిచేందుకు గల కారణాలు కూడా వెల్లడించారు.

సీఎం అఖిలేష్ కు యూపీలో మంచి పేరు ఉంది. కాకాపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేల పట్ల మాత్రం జనంలో తీవ్ర వ్యతరేకత ఉందన్నారు. పైగా కాంగ్రెస్ తో జతకట్టడం ఎస్పీకి కీడు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ కు వందకు పైగా సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారికి సీట్లు ఇవ్వడం ఎస్పీకి చేటు చేసిందని తెలిపారు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఏకంగా వంద మందికి పైగా ఓడిపోయే అవకాశం ఉందని తెలిపారు.

ఇక బీజేపీకి మోదీ కల్పించిన ప్రచారమే ప్లస్ పాయింట్ అయిందన్నారు. ముఖ్యంగా హిందూ ఓట్ల ఏకీకరణకు మోదీ చేసిన ప్రసంగాలు బాగా కలిసొచ్చాయని అన్నారు. ముస్లీంల కోసం ఎంతో చేసినా హిందువులను పట్టించుకోకపోవడం మైనస్ అయిందన్నారు. రైతు రుణమాఫీని మోదీ తెరపైకి తేవడం రైతులను ఆ పార్టీకి దగ్గర చేసిందన్నారు. ఈ విషయంలో అఖిలేష్ వెనకబడ్డారని తెలిపారు.

అయితే పంజాబ్ లో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి ఫ్లాష్ టీమ్ అంచనా వేసింది. అకాలీదళ్, బీజేపీ సంకీర్ణాణికి ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ కు 117 స్థానాల్లో అత్యధికంగా 70 సీట్లు వస్తాయని అంచనా వేశారు. దీనికి కారణం ఆ పార్టీలోకి సిద్ధూ వెళ్లడమేనని చెప్పారు. అయితే బీజేపీకి కేవలం 4 నుంచి 5 వరకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →