టీడీపీలో ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో పాటు.. ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటూ బాబు సర్కార్‌కు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరాడు. ఈ సందర్భంగా ప్రధానితో ఏఏ అంశాలు మాట్లాడాలనే విషయాలపై నిన్న జరిగిన కేబినెట్ సమాశంలో చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవడంతో పాటు నీట్ వ్యవహారాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకుపోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరువు పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయని, వీళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రాన్ని ఉందనే విషయాన్ని బాబు గుర్తు చేయనున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
కాకపోతే సమస్య అంతా ఇక్కడే వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ నాయకులు ఒకడుగు ముందుకేసి తప్పంతా చంద్రబాబు నాయుడిదేనని అంటున్నారు. కేంద్రంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే బీజేపీ నేత సోము వీర్రాజు సైతం బాబును కొంచెం ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తే బీజేపీ టీడీపీతో తెగతెంపులు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధానిని కలవనున్న చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ఏం సమాచారం మోసుకోస్తోడోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.