Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP informed No special status for AP!

By   /  August 6, 2016  /  Comments Off on BJP informed No special status for AP!

    Print       Email

ap mapహోదా రాన‌ట్లే!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని రెండేళ్లుగా ఎదురు చూసిన రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నిరాశే ఎదురైంది. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన భార‌తీయ జ‌న‌తాపార్టీ ఇప్పుడు ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌క‌నే చెప్పింది. సాంకేతిక కార‌ణాలు చూపుతు చేతులు దులిపేసుకుంది. కాంగ్రెస్ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌త్యేక  ప్రైవేట్ బిల్లు  ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ అభ్యంతరాలు లేవ‌నెత్త‌డంతో ఈ బిల్లు మ‌నీ బిల్‌లా?కాదా అనేది తేల్చే విష‌య‌మై ఈ బిల్లును లోక్‌స‌భ స్పీక‌ర్ కు రిఫ‌ర్ చేస్తున్న‌ట్లు  డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రూలింగ్ ఇచ్చారు. దీంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. కాగా రాజ్యసభలో చట్టాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోను కుదిరే పని కాదని, ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లు కాబట్టి వోటింగ్ జరిపించలేమని చెబుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఆలోచన తమకు ఎట్టి పరిస్థితుల్లో లేదని కుండ బద్దలు కొట్టారు జైట్లీ. ఒక ప్రభుత్వం లోక్ సభలో మైనారిటీలో ఉండి కొనసాగలేదని, రాజ్యసభలో మైనారిటీలో ఉండి కూడా కొనసాగగలదని, భారత రాజ్యాంగం కల్పించిన విశేషమైన హక్కు ఇదని ఆయన గుర్తు చేసుకున్నారు.

రాజ్యసభలో బలం ఉంది కదా అని ఇబ్బందులు పెట్టాలని చూసే విపక్షాలకు అడ్డుకట్ట వేసేందుకే రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని అన్నారు. లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకూ వేర్వేరు హక్కులే ఉంటాయని వివరించారు. లోక్ సభ కార్యదర్శి, స్పీకర్ మాత్రమే బిల్లు ద్రవ్య బిల్లా? కాదా అన్నది నిర్ణయించగలుగుతారని అన్నారు. ఇప్పటికే లోక్ సభ కార్యదర్శి దీన్ని మనీ బిల్లుగా తనకు స్పష్టం చేశారని అన్నారు. కేవీపీ ప్రైవేటు హోదా బిల్లుతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని, చర్చలు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు, డిమాండ్లు, కేంద్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో మౌలిక వసతులు వంటి ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయని జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా మనీ బిల్లేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

మనీ బిల్లులపై రాజ్యసభలో చర్చ చేపట్టవచ్చు గానీ, ఎలాంటి వోటింగులకూ ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా అన్న విషయమై అనుమానాలు తలెత్తితే, లోక్ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ (స్పీకర్) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ద్రవ్య బిల్లులన్నీ తొలుత లోక్ సభలో మాత్రమే చర్చకు రావాలన్న రాజ్యాంగ నిబంధనలను జైట్లీ చదివి వినిపించారు. ఏపీకి అవసరమైన అన్ని సహాయాలు చేస్తామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నామని అన్నారు. ఆనాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న విషయమై సమాలోచనలు జరుపుతున్నామని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సాధ్యమైనంత మేరకు కృషి చేస్తామని తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ వోటింగ్ సాధ్యపడదని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇక రాన‌ట్లేన‌ని  రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు మేధావులు చ‌ర్చించుకోవడం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →