Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP internal fight negative feedback on Narendra Modi & Amith Shah

By   /  March 30, 2018  /  Comments Off on BJP internal fight negative feedback on Narendra Modi & Amith Shah

    Print       Email

ఎంత‌మాట‌…ఎంత‌మాట‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* దేశాన్ని మోడీ నాశ‌నం చేశారా?

* అదీ బీజేపీ నేత‌లే అటారా?

* మోడీకి ఓటు వేయకండి అని కూడా అంటారా?

* క‌ర్ణాట‌క‌లో సొంత‌పార్టీ నేత‌లే ప‌రువు తీస్తున్నారు

డెక్క‌న్ అబ్రాడ్‌: భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆ పార్టీ నేత‌లే శ‌త్రువులుగా త‌యార‌వుతున్నారు. న‌లుగురిలో ప‌రువు తీస్తున్నారు. ఒక‌సారి అనుకుంటే పొర‌పాటు కావ‌చ్చు.. ప‌దే ప‌దే జ‌రుగుతోంది. కర్ణాటక ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ప్రచారంలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మాట్లాడుతూ సొంత పార్టీ సీఎం అభ్యర్థి యాడ్యురప్పను దేశంలోనే అత్యంత అవినీతిపరుడంటూ విమ‌ర్శించ‌గా.. తాజాగా మ‌ళ్లీ అలాంటి త‌ప్పే జ‌రిగింది.  దేవనగిరి జిల్లా చల్లకెరెలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనే వ్యక్తి అనువదిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వ నాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు. దేశాన్నిఆయన నాశనం చేయడం ఖాయం.. దయచేసి ఆయనకు ఓటు వేయ‌కండి’’ అని అనడంతో అక్కడున్న అందరూ అవాక్కయ్యారు.

అయితే అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘సిద్ధ రామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మోదీపై మీకున్న అభిమానాన్ని యాడ్యురప్పకు ఓటేయడం ద్వారా చూపించండి. కర్ణాటకను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మారుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అనువాదకుడు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పాడు. దీంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →