బాబు హిట్లరా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇప్పటి వరకు ప్రతిపక్షాలు విమర్శించడం చూశాం. కానీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఇప్పుడే అదే దారిలో వెళ్తోంది. ప్రతిపక్షంతో పోటీ పడి బాబును విమర్శిస్తున్నారు. ఇప్పటి వాళ్లుకూడా అంతగా విమర్శించి ఉండరేమోనని పిస్తోంది. విజయవాడలో గుళ్లను కూల్చి అదే స్థానంలో టాయిలెట్లు కడుతుండడంతో బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ ప్రెస్మీట్ పెట్టి బాబును విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబును హిట్లర్ తో పోల్చారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో పాలన హిట్లర్ పాలనలాగా ఉందన్నారు. కూల్చివేసిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దొంగల్లాగా అర్థరాత్రి వచ్చి విగ్రహాలను కూల్చడం ఏమిటిని ప్రశ్నించారు. కాగా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఆందోళనలు మొదలుపెట్టడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఆలస్యంగా ఈ అంశాన్ని అందుకుని చంద్రబాబును డిఫెన్సులోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఆ కారణంగానే నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడే నేతలు కాకుండా చంద్రబాబుతో సఖ్యతో ఉన్న నేతలే విమర్శలకు దిగేలా ప్రణాళికలు వేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మామూలుగా అయితే సోమువీర్రాజు – పురంధేశ్వరి – కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతుంటారు. కానీ.. ఈసారి విష్ణుకుమార్ రాజు – ఆకుల సత్యానారాయణలు ఆ బాధ్యతను తీసుకున్నారు. అంతేకాదు.. చంద్రబాబును హిట్లరుతో పోల్చుతూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.