Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP is having difficulty in finding the right leader for their party in AP

By   /  August 10, 2016  /  Comments Off on BJP is having difficulty in finding the right leader for their party in AP

    Print       Email

BJP-Logo-Photosఏపీ బీజేపీకి అధ్య‌క్షుడు దొరికేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఒక రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపిక పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎన్నో రోజులుగా బీజేపీకి అధ్య‌క్షుడిని ఎంపిక చేయాల‌ని కేంద్రం అనుకుంటున్నా ఎందుక‌నో ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌డం లేదు. ఇటీవ‌ల అధ్య‌క్షుడి ఎంపిక‌ అంతా అయిపోయింది అనుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. దీంతో ఆ పార్టీకి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. కాగా ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు స్ధానంలో కొత్త నేత ను అధ్యక్షునిగా నియమించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించటంతోనే సమస్య మొద లైంది. ఎటు తిరిగీ అధ్యక్షునిగా కొత్త నేతను నియమిస్తున్నారు కాబట్టి పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు నేతలు ప్రతిపాదించారు. దానికి తగ్గట్లే పార్టీ కూడా వీర్రాజును శాసనమండలి సభ్యునిగా నియమించింది. జాతీయ నాయకత్వం కూడా వీర్రాజు అభ్యర్ధిత్వం పట్ల సానుకూలత కనబరచింది. అయితే అప్పుడే తెరవెనుక రాజకీయాలు మొదలయ్యాయి. మిత్రపక్షమని కూడా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ప్రభుత్వ పనితీరును వీర్రాజు తీవ్రంగా విమర్శిం చటం పలు ఆంశాలపై విరుచుకుపడుతున్నారు.

వీర్రాజుకు మద్దతుగా పార్టీలోని పురంధేశ్వరి కావూరి సాంబశివరావు కన్నా లక్ష్మీనారాయణ మంత్రి మాణిక్యాలరావుతో పాటు అనేక మంది నిలిచారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుపైన విమర్శలు ఆరోపణలు చేయటం సముచితం కాదంటూ పార్టీలోనే ఉన్న మరో వర్గం వీర్రాజు వ్యవహారశైలిని వ్యతిరేకిస్తోంది. ఈ వర్గంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయడు మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షుడు హరిబాబు తదితరులున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. వెంకయ్యనాయుడు వర్గం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు పూర్తిస్ధాయిలో పార్టీ తరపున మద్దతు అందిస్తున్నట్లు వీర్రాజు వర్గం జాతీయ నాయకత్వానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.

ఇదిలాఉండగా రేపోమాపో ప్రకటనే ఆలస్యమనకుంటున్న సమయంలో వీర్రాజు నియామకం ప్రకటన ఆగిపోయివడం వెనుక ఆయన వ్యతిరేక టీం ఉందని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్న వీర్రాజు అధ్యక్షునిగా నియమితులైతే ఇబ్బందేనని అందుకనే ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబునే కొనసాగించేవిధంగా టీడీపీలోని ముఖ్యనేత ఒకరు వెంకయ్యనాయడుతో చెప్పటం వల్లే వీర్రాజు నియామకం వాయిదాపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. అప్పటి నుండి కొత్త అధ్యక్షుని నియామకం ప్రకటన వెంటనే చేయించాలని ఒక వర్గం వాయిదా వేయించాలని వ్యతిరేక వర్గం ఒకదానిపై మరొక వర్గం ఎత్తుకుపై ఎత్తులు వేసుకుంటున్న నేప‌థ్యంలో ఏపీ బీజేపీకి ఇప్పుడ‌ప్పుడే అధ్య‌క్షుడు దొరికే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →