ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్రం ఆరా!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతి పక్షమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఓటుకు నోటు కేసు ఇపుడు చంద్రబాబును బాగా ఇరుకున బెట్టబోతున్నట్లు సర్వత్రార ప్రచారం జరుగు తోంది. అయితే, ఏసీబీ న్యాయస్థానంలో తనపై విచారణ జరిపేందుకు వీల్లే దంటూ చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నఈ పరిణామాలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలో కూడా అఖిలపక్షాన్ని పిలువడం లేదని, అంతా తానొక్కడై చూసుకుంటున్నారని బీజేపీలోని ఒక వర్గం ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి చేరవేయటంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయంకు కూడా అందచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణా మాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ఒకవేళ స్విస్‌చాలెంజ్ విధానం, ఓటుకునోటు కేసుల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు చెబితే ఏమి చేయాలనే విషయంలో జాతీయ నాయ కత్వం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
స్విస్‌చాలెంజ్ విధానం విషయం అటుంచితే, ఓటుకునోటు కేసు మాత్రం చంద్రబాబు ముఖ్య మంత్రి పీఠానికి ఎసరు తెచ్చేదిగానే ఉన్నట్లు కమలనాధులు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితే ఎదురైతే మిత్రపక్షాలు ఎవరిదారి వారు చూసుకోక తప్పదని బీజేపీ నేతలంటున్నారు. ఏది ఏమైనా ఓటుకు ఎప్పుడో ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న ఓటుకు నోటు కేసు, ఇంతకాలమూ కోల్డ్ స్టోరేజ్‌లో ఉండి ఇపుడు హటాత్తుగా చలనం రావటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.