Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP is not consistant across the nation, says Shabbir Ali

By   /  April 16, 2017  /  Comments Off on BJP is not consistant across the nation, says Shabbir Ali

    Print       Email

shabbir aliగుజరాత్ ఒకలాగ.. తెలంగాణలో మరొకలాగ బీజేపీ వ్యవహరిస్తోంది: షబ్బీర్ అలీ

 

InCorpTaxAct
Suvidha

 

 

బీజేపీ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ గుజరాత్ ఓ రకంగా.. తెలంగాణలో మరోరకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుజరాత్ లో పటేళ్లకు పది శాతం మేర రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని నిలదీశారు. అదే బీజేపీ ముస్లీంలకు రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. హిందువుల్లో ఏ వర్గానికి రిజర్వేషన్ ఇచ్చినా అది సరైనది అవుతుందా అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టులు, చట్టాలు ఉన్నాయని అన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లా మారారని ఆరోపించారు. తెలంగాణ సర్కారుపై కూడా షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. తక్షణం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →