బీజేపీపై తమ్ముళ్ల ఎదురుదాటి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు భారతీయ జనతాపార్టీ సుముఖంగా లేనట్లు అందరికీ అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. ఎన్నికల ముందు ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ సర్కార్ ఇప్పుడు మాట మార్చడంపై ఫైర్ అవుతున్నారు. మొన్న అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇక బీజేపీ-టీడీపీకి విడాకులేనని చెప్పగా, నిన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మరో ఎంపీ మాగంటి బాబు కూడా బీజేపీపై ఫైర్ అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే అంటున్నారు. కాగా కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ మాత్రం బీజేపీతో సఖ్యతగా ఉంటూనే హోదా సాధించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంకా మెతక వైఖరే అవలంభిస్తుండడం గమనార్హం. అసలే ఆర్థికంగా నష్టాలు పడుతున్న ఈ సమయంలో కేంద్రం నుంచి విడిపోతే అసలుకే ఎసరు వస్తుందనేది చంద్రబాబు ఆలోచన.
అయితే హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హోదాపై రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేస్తుంటే తాము ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఇప్పుడు ఏమీ మాట్లాకపోతే బాగుండని టీడీపీలోని కొంతమంది చంద్రబాబుకు చెప్పినా ఆయన ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని ఆ పార్టీలోని కొంతమంది సభ్యులు అంటున్నారు. బాబు తీరు ఏంబాగోలేదని, కేంద్రంతో పోరాడాల్సిన సమయంలో ఇంకా నాన్చుడు ధోరణి ఏంటిని వాళ్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ సభ్యులు రెండుగా విడిపోయారని స్పష్టమవుతోంది. కాగా ఒక వర్గం మాత్రం బీజేపీపై ఎదురుదాడికి దిగుతుంటే.. మరో వర్గం మాత్రం బాబు బాటలోనే పయనిస్తుండడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.