Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP leader Raja Singh resigns to MLA position..

By   /  March 22, 2017  /  Comments Off on BJP leader Raja Singh resigns to MLA position..

    Print       Email

mla raja singhఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజా సింగ్

 

InCorpTaxAct
Suvidha

 

 

గత రెండు రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా గురించి తీవ్ర చర్చలు సాగుతున్నాయి. చివరకు అన్నట్లుగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు ఆయన ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

తన నియోజక వర్గ సమస్యలపై చర్చించాలని ఆయన కోరారు. అయితే సీఎం కేసీఆర్ సమస్యలపై చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నిన్న కూడా కేసీఆర్ ని కలిసేందుకు క్యాంపు ఆఫీసుకు వెళ్లానని చెప్పారు. అయితే తనకు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. రాజా సింగ్ గోషా మహల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజక వర్గంలో నాటు సారా తయారీదారులకు తక్షణం వేరే ఉపాధి కల్పించాలని తెలంగాణ సర్కారును కోరారు. దీనిపై ఆయన రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. ఈ లేఖను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →