నేను సీఎం అయితే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేవాడిని: విష్ణుకుమార్ రాజు
పురంధేశ్వరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై పురంధేశ్వరి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇదికాస్తా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంలో పురంధేశ్వరిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ విషయంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పురందేశ్వరి రాసిన లేఖ ఆమె వ్యక్తిగతం అని అన్నారు. ఆమె లేఖ రాయడం పార్టీ నిర్ణయం మాత్రం కాదన్నారు. ఈ అంశంలో నేను వ్యక్తిగతంగా పురంధేశ్వరితో ఏకీభవిస్తానని అన్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సంప్రదాయ విరుద్ధం అని అన్నారు. ఆ నలుగురు మంత్రులు రాజీనామా చేయాలని అన్నారు. వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వారికే గౌరవం పెరుగుతుందని అన్నారు. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమేనని అన్నారు. తానే సీఎం అయి ఉంటే వారి చేత రాజీనామాలు చేయించి ఉండేవాడినని అన్నారు. ఓ పార్టీ తరపున నెగ్గి మరో పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.