Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP MLA Vishnu Kumar Raju fires on Governer Narisimhan

By   /  January 2, 2018  /  Comments Off on BJP MLA Vishnu Kumar Raju fires on Governer Narisimhan

    Print       Email

గవర్నర్ నరసింహన్ పై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఫైర్ అయ్యారు. గవర్నర్ హైదరాబాదులో ఉంటున్నారని అన్నారు. అందువల్ల ఆయనకు తెలంగాణపైనే ఎక్కువ ప్రేమ ఉందన్నారు. ఏపీ విషయంలో ఆయన వివక్షతో వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణ బిల్లును (నాలా) నెలరోజులైనా గవర్నర్ ఆమోదించలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇలాంటి బిల్లును కేవలం వారం రోజుల్లోనే ఆమోదించారని అన్నారు.

ఏపీకి నాలా చట్టం చాలా అవసరమని అన్నారు. ఆ చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదన్నారు. నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని అన్నారు. ఈ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలియజేయాలని అన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tollywood – 81 veena Songs

Read More →