టాయిలెట్‌ను శుభ్రపరిచిన ఎంపీ.. నిజమైన నాయకుడు అంటూ వైరల్..!
భారత దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భారత్ దేశంలో స్వచ్ఛభారత్ తో దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని సందేశం ఇచ్చారు. ఇందుకోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వచ్చారు.. వస్తున్నారు. అయితే కొంతమంది నేతలు స్వచ్చభారత్ అంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు. దీంతో చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించాలని చాటి చెప్పాడు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.