Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP plans Defamation suit on RaGa

By   /  March 17, 2017  /  Comments Off on BJP plans Defamation suit on RaGa

    Print       Email

rahul-gandhi1రాహుల్ పై బీజేపీ పరువు నష్టం దావా..

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై గోవా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శి గిరీశ్ చోదంక‌ర్‌ తో పాటు రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గోవాలో ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల‌కు ఏకంగా వెయ్యి కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందని ఆరోపణలు చేశారు.

InCorpTaxAct
Suvidha

దీంతో రాహుల్ గాంధీతో పాటు గిరీశ్ చదంకర్ పై పరువు నష్టం దావా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేయాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన లీగ‌ల్ నోటీసు డ్రాఫ్ట్‌ ను త‌యారుచేసే పనిలో గోవా బీజేపీ ప్రెసిడెంట్ విన‌య్ టెండూల్క‌ర్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తమపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగే వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →