Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP president Amith Shah vists Hyderabad on 7th July..

By   /  April 6, 2017  /  Comments Off on BJP president Amith Shah vists Hyderabad on 7th July..

    Print       Email

amith-shah1బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు..

 

InCorpTaxAct
Suvidha

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. యూపీలో రికార్డు స్థాయిలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా, మణిపూర్ లలో కూడా చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా ఫుల్ జోష్ లో ఉన్నారు. తర్వాతి టార్గెట్ గా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను పెట్టుకున్నారు. అలాగే దక్షిణాదిలో కూడా బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది.
ఇదిలాఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 7న అమిత్‌ షా హైదరాబాద్‌ కు రానున్నారు. మొదటగా బ్యాంక్‌ ఉద్యోగులు, మేధావులతో ఆయన సమావేశం కానున్నారు. తర్వాత పాతబస్తీలోని దళితవాడలో కాలనీ వాసులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. అదే రోజే సా. 5 గంటలకు ఎగ్జిబీషన్ గ్రౌండ్స్‌లో 14000మంది బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొననున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →