Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP Somu Veeraju’s controversial comments on TDP

By   /  May 13, 2016  /  Comments Off on BJP Somu Veeraju’s controversial comments on TDP

    Print       Email

somuబీజేపీ నుంచి ఒకే ఒక్క‌డు!

 

InCorpTaxAct
Suvidha

 

 

భార‌తీయ జ‌న‌తా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు మిత్ర‌ప‌క్షాలే అయినా అధికార పార్టీ త‌ప్పుల‌ను ఎత్తిచూపేది మాత్రం బీజేపీ నుంచి ఒక్క‌రే. సూచ‌న‌లు కానీ.. విమ‌ర్శ‌లు కానీ ఆయ‌న త‌ప్ప మ‌రేవ‌రూ నోరు విప్ప‌రు. కేంద్ర ప్ర‌భుత్వానికి వీర విధేయుడుగా ఉంటూ.. ఇక్క‌డ బాబు స‌ర్కార్‌ను ఇరుకు పెడుతున్న ఆ ఒక్క లీడ‌రే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న‌వారు కానీ.. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎవ‌రూ బాబు గురించి మాట్లాడ‌క‌పోయినా సోమువీర్రాజు మాత్రం ముందుటాడు. ముక్కుసూటిగా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే వీర్రాజు ఇప్పుడు బాబుకు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యాడు. ప్ర‌త్యేక హోదా పై  చంద్ర‌బాబు రోజుకో మాట మాట్లాడుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

“ప్రత్యేక హోదా ఏమయినా సంజీవినినా? హోదా పొందిన రాష్ట్రాలు కూడా ఇంకా వెనకబడి ఉన్నాయి. హోదా వస్తుందా రాదా అనే దాని కంటే రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేదే చాలా ముఖ్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నోసార్లు అన్నారు. మళ్ళీ ఆయనే ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోతుందన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకే విషయంపై ఆయన ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న మాట వాస్తవమా కాదా? కేంద్ర ప్రభుత్వం సహాయం పొందుతూనే ముఖ్యమంత్రి దానిపై నిందలు వేయడం సబబు కాదు” అని అన్నారు.  హోదా విషయంలో బీజేపీ మాటతప్పిందని టీడీపీ నేతలు విమ‌ర్శిస్తుంటే హోదా కంటే ఎక్కువే ఇస్తామని చెప్పినా.. టీడీపీ ఇలా ప్రవర్తించడంపై బీజేపీ మండిపడుతోంది. ఇక టీడీపీ, బీజేపీల మ‌ధ్య‌ లాంఛ‌నంగా యుద్ధం మొద‌లైన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →