Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP stakes claim to form govt as Congress MLAs rebel, Harish Rawat claims full majority

By   /  March 20, 2016  /  Comments Off on BJP stakes claim to form govt as Congress MLAs rebel, Harish Rawat claims full majority

    Print       Email

Harish Rawat 1

ఉత్తరాఖండ్ సర్కారుకు పొంచి ఉన్న ముప్పు..?

InCorpTaxAct
Suvidha

 

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్‌ సర్కారుకు ముప్పు పొంచిఉంది. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేయడంతో సంక్షోభం నెలకొంది.పైకి తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని సీఎం హరీష్‌ రావత్‌ చెబుతున్నారు. అయితే .. ఉత్తరాఖండ్‌లో హరీష్‌ రావత్‌ సర్కారు ఊగిసలాడుతోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ, క్యాబినెట్‌ మంత్రి హరక్‌ సింగ్‌ రావత్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంలో పడింది. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు 27 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని ఓ హోటల్‌లో తిష్ట వేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటి నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి డెహ్రాడూన్‌లో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. 27 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ కె కె పాల్‌ను కలుసుకుని సర్కారు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత శుక్రవారమే కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు. బడ్జెట్‌ ఆమోదించేందుకు ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అయితే స్పీకర్‌ ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చారు.శాసన సభను మార్చి 28 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు.. సీఎం హరీష్‌రావత్‌ నైతికంగా బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని మాజీ సీఎం విజయ్‌ బహుగుణ డిమాండ్‌ చేస్తున్నారు. మరో తిరుగుబాటు నేత హరక్‌ సింగ్‌ రావత్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక.. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ అంటున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనతో సంప్రదిస్తున్నారని.. వారు కాంగ్రెస్‌ను వీడిపోరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 76 మంది ఎమ్మెల్యేలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులున్నారు. ప్రభుత్వానికి కావలసిన మేజిక్‌ ఫిగర్‌ కన్నా కేవలం ఒక్క ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్నారు. బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. తమకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ సర్కారు మైనారిటీలో పడిపోయిందని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →