Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP TS chief criticized CM KCR

By   /  September 13, 2017  /  Comments Off on BJP TS chief criticized CM KCR

    Print       Email

కాంగ్రెస్ కి పట్టిన గతే టీఆర్ఎస్ కి కూడా పడుతుంది: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

 

Suvidha
Biryani Pot

 

 

 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. ఇప్పడు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతుల్లో బందీ అయిపోయిందని విమర్శించారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లిస్ కు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. అలా చేస్తే ప్రజలు హర్షించరని అన్నారు. మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మలా మారిపోయిందని విమర్శించారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలోనే కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు. కాని కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తోందన్నారు. కాంగ్రెస్ కు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందని విమర్శించారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

Read More →