Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BJP will get majority in 2019 elections in TS, Laxman!

By   /  May 13, 2016  /  Comments Off on BJP will get majority in 2019 elections in TS, Laxman!

    Print       Email

BJP-Logo-Photosబీజేపీ టార్గెట్ 2019

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ కొత్త వ్యూహాల‌ను ప‌న్నుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నారు.  రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీని మ‌ట్టి క‌రిపించాలనే ఉద్దేశ్యంతో అన్ని జిల్లా నేత‌ల‌తో మాట్లాడుతూ ప‌ల్లెల నుంచి పార్టీని బ‌లోపేతం చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు, ప‌థ‌కాలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బ‌ల‌ప‌డ‌డానికి కూడా కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వ హించడం, మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను సైతం ఘ‌నంగా నిర్వ‌హించి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ద‌గ్గ‌రికి చేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా బీజేపీకి క‌లిసి వ‌చ్చే అంశం.  దేశంలో 85శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను మచ్చిక చేసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అధికారం చేప‌ట్ట‌వ‌చ్చ‌నేది బీజేపీ ధీమా.

అయితే ల‌క్ష్మ‌ణ్ కూడా రాష్ట్రం బీజేపీ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేస్తూనే అధికార పార్టీ లోపాల‌ను ఎత్తిచూపుతున్నారు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీలు అయితే ఇచ్చారు కానీ అన్నీ నెర‌వేర్చ‌లేద‌ని, బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటున్నారు.  కాగా కేసీఆర్ హామీలు రూ.50వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, బీసీ సంక్షేమానికి ఏటా రూ.5వేల కోట్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్య, దళితులకు 3ఎకరాల భూ పంపిణి తదితర వాటిపై పోరుబాట‌కు ల‌క్ష్మ‌ణ్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ కొంచెం దూకుడు పెంచి ఈ మూడేళ్లు ఇలాగే క‌ష్ట‌ప‌డితే మాత్రం 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →