Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Blue-Red flags Flags should unite, says Yechuri Sitaram..

By   /  March 19, 2017  /  Comments Off on Blue-Red flags Flags should unite, says Yechuri Sitaram..

    Print       Email

yechuri sitaramనీలం-ఎర్ర జెండాలు ఏకం కావాలి: ఏచూరి సీతారం

సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో సమర సమ్మేళనం సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏచూరి సీతారాం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా లాల్ సలాం, జై భీమ్ నినాదాలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. నీలం, ఎర్ర జెండాలు సమక్యంగా పోరాటం చేయాలని అన్నారు. అలా అయితే మన ఐఖ్యతను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

InCorpTaxAct
Suvidha

గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు కేసీఆర్ తనకు మంచి మిత్రుడని అన్నారు. కాని సీఎం అయిన తర్వాత ఎందుకో దూరం జరిగారని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఊదరగొడుతున్న కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన పోరాటాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. గతంలో జరిగిన సాయుధ పోరాటం భూ సంస్కరణలకు దారి తీసిందని అన్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను ఎన్నుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. వారి తీరు ఆందోళనకరమని అన్నారు. గో రక్షా పేరుతో దళితులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.సీపీఎం పార్టీ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తోందని అన్నారు. దీనికోసం ప్రజా ఉద్యమాన్ని మరింత బలపరుస్తామని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →