Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Boat drown in the Libya coast.. 10 died..100’s missing

By   /  June 11, 2017  /  Comments Off on Boat drown in the Libya coast.. 10 died..100’s missing

    Print       Email

లిబియా తీరంలో పడవ మునక.. 10 మంది మృతి.. 100 మంది గల్లంతు..

 

InCorpTaxAct
Suvidha

 

లిబియాలో మరో విషాదం చోటుచేసుకుంది. మరోసారి వలసదారులతో వెళ్తున్న బోట్ లిబియా తీరంలో నీట మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో వంద మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాద ఘటనపై తీర రక్షక దళం అధికారులు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీసినట్లుగా తెలిపారు. ప్రమాదానికి గురైన సమయంలో పడవలో 120 మంది ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.

లిబియాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా వేలాదిమంది శరణార్థులు ఆ దేశాన్ని వీడి యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా ఏడాది కాలంలో ఏకంగా 60 వేల మందికి పైగా మధ్యధరా సముద్రం దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి తెలిపింది. వీరిలో 1800 మంది చనిపోవడమో, గల్లంతవడమో జరిగిందని తెలియజేసింది. ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ అధికారులు ఈ ఘటనపై మాట్లాడుతూ లిబియా నుంచి వచ్చిన 1650 మంది వలసదారులను రక్షించినట్టుగా తెలిపారు. వారికి సాయం అందిస్తున్నామన్నారు. తాము గత రెండు రోజుల్లోనే ఏకంగా 900 మంది వలసదారులను రక్షించామని ఇటలీ తీర రక్షక దళం తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →