ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా బాహుబలి2 చిత్రం నుంచి అవుట్ అయ్యాడు. అంటే షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు ఫ్రీ అయిపోయాడన్నమాట. ఇక తన కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న సుజిత్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీగానే తెరకెక్కనుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. మరి మూడు భాషల్లో నిర్మిస్తున్నారంటే దానికి తగినట్లుగా కాస్టింగ్ కూడా ఉండాలి కదా.
ఇందులో భాగంగానే పలువురు బాలీవుడ్ నటులను కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నారు. రీసెంట్ గా జాకీష్రాఫ్, వివేక్ ఒబేరాయ్ తో చర్చలు జరిపారు. వీరిద్దరూ ఈ సినిమాకి ఒప్పుకుంటే ఈ మూవీకి నేషనల్ రేంజ్ లో పబ్లిసిటీ వస్తుందని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. వివేక్ ఒబేరాయ్ ఆర్జీవీ తీసిన రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. అలాగే జాకీ ష్రాప్ ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాల్లో కనిపించాడు. వీరిని ఎంపిక చేస్తే అటు హిందీ, ఇటు తెలుగుకు కూడా ఉపయోగపడతారని దర్శక నిర్మాతల ఆలోచనగా ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.ఈ నెలాఖరునా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా శంకర్-ఎహసాన్-లాయ్ పనిచేయనున్నారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.